ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తొలి మేనిఫెస్టోతో అన్నివర్గాలకు మేలు

ABN, First Publish Date - 2023-06-26T01:32:47+05:30

తెలుగుదేశం పార్టీ ఇటీవల ప్రకటించిన తొలి మేనిఫెస్టో రాష్ట్రంలోని అన్నివర్గాలకు మేలు చేకూర్చుతుందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.

కొత్తఎల్లవరంలో పల్లె నిద్ర చేస్తున్న అయ్యన్నపాత్రుడు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ పాలనతో ప్రజలు విసుగు

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం టీడీపీదే

గొలుగొండ , జూన్‌ 25 : తెలుగుదేశం పార్టీ ఇటీవల ప్రకటించిన తొలి మేనిఫెస్టో రాష్ట్రంలోని అన్నివర్గాలకు మేలు చేకూర్చుతుందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో టీడీపీ చేపట్టిన బస్సు యాత్ర శనివారం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో సాగి, రాత్రి గొలుగొండ మండలం ఎర్రవరానికి చేరుకుంది. పల్లె నిద్రలో భాగంగా గ్రామంలోని సర్పంచ్‌ కొల్లు ్లరాంబాబు ఇంట సదరు నాయకులంతా సబ చేశారు. ఆదివారం ఉదయం చోడవరం నియోజకవర్గానికి బయల్దేరే ముందు అయ్యన్న విలేకరులతో మాట్లాడారు. అభి వృద్ధి, సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసే సత్తా చంద్రబాబుకు మాత్రమే సాధ్యమన్నారు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో విసిగిపోయిన రాష్ట్ర ప్రజానీకం ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతరం మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగ జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.రాజు, పార్టీ గొలుగొండ మండల అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, కొత్తఎల్లవరం సర్పంచ్‌ కొల్లు రాంబాబుతో పలు పలువురు సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, నాయకులు చోడవరం నియోజకవర్గానికి బయల్దేరి వెళ్లారు.

‘నాయకుల స్వలాభం కోసమే యాత్ర’

నర్సీపట్నం అర్బన్‌ : టీడీపీ నాయకుల భవిష్యత్తు కోసమే బస్సుయాత్ర చేపడుతున్నారని ఎమ్మెల్యే గణేశ్‌ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో హామీలను పూర్తిగా నెరవేర్చలేదన్నారు. ప్రస్తుతం ప్రజలను మోసం చేసేందుకే బస్సు యాత్ర చేపడుతున్నారన్నారు. హామీలు అమలు చేసిన ఘనతన జగన్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.

Updated Date - 2023-06-26T01:32:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising