ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవరపాలెం గౌరీపరమేశ్వరుల ఉత్సవం రేపు

ABN, First Publish Date - 2023-01-27T01:01:53+05:30

స్థానిక గవరపాలెంలలోని గౌరీపరమేశ్వరుల ఉత్సవాన్ని ఈ నెల 28వ తేదీ శనివారం ఘనంగా నిర్వహించనున్నట్టు ఉత్సవ కమిటీ చైర్మన్‌ కొణతాల సంతోష్‌ అప్పారావునాయుడు తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉత్సవాలను ఏటా మాదిరిగా భారీ ఎత్తున నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఉత్సవంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన కోసం 25చోట్ల వేదికలను ఏర్పాటు చేశామన్నారు. కోల్‌కతా వారి ట్రీప్‌ లైటింగ్‌తోపాటు పలు వీధుల్లో విద్యుత్‌ అలంకరణలతో దేవతామూర్తుల సెట్టింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. జానపద, ఆధ్యాత్మిక, సాంస్కృతిక నృత్యప్రదర్శనలు, నేలవేషాలు వుంటాయని చెప్పారు. భక్తులు ఇబ్బంది పడకుండా, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం ఉత్సవాల ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు.

గౌరీపరమేశ్వరుల ఉత్సవ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కమిటీ ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు

25 వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాలు

ఉత్సవ కమిటీ చైర్మన్‌ కొణతాల అప్పారావునాయుడు

అనకాపల్లి టౌన్‌, జనవరి 26 : స్థానిక గవరపాలెంలలోని గౌరీపరమేశ్వరుల ఉత్సవాన్ని ఈ నెల 28వ తేదీ శనివారం ఘనంగా నిర్వహించనున్నట్టు ఉత్సవ కమిటీ చైర్మన్‌ కొణతాల సంతోష్‌ అప్పారావునాయుడు తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉత్సవాలను ఏటా మాదిరిగా భారీ ఎత్తున నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఉత్సవంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన కోసం 25చోట్ల వేదికలను ఏర్పాటు చేశామన్నారు. కోల్‌కతా వారి ట్రీప్‌ లైటింగ్‌తోపాటు పలు వీధుల్లో విద్యుత్‌ అలంకరణలతో దేవతామూర్తుల సెట్టింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. జానపద, ఆధ్యాత్మిక, సాంస్కృతిక నృత్యప్రదర్శనలు, నేలవేషాలు వుంటాయని చెప్పారు. భక్తులు ఇబ్బంది పడకుండా, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం ఉత్సవాల ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఉత్సవ కమిటీ నాయకులు కొణతాల శ్రీనివాసరావు, కొణతాల నూకమహలక్ష్మినాయుడు, కొణతాల మురళీకృష్ణ, పీవీ రమణ, ఆలయ ప్రతినిధులు కోరిబిల్లి సత్యనారాయణ, మద్దాల ఓం శివ, కర్రి రుద్రినాయుడు, మద్దాల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-27T01:02:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising