ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఎసరు

ABN, First Publish Date - 2023-06-01T00:34:57+05:30

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 99 మంది విద్యార్థుల (మూడు నుంచి ఎనిమిది తరగతులు చదువుతున్న వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు) కంటే తక్కువ కలిగిన 52 ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్లను మరొక పాఠశాలకు బదిలీ చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమునిపట్నం రూరల్‌, మే 31: ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 99 మంది విద్యార్థుల (మూడు నుంచి ఎనిమిది తరగతులు చదువుతున్న వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు) కంటే తక్కువ కలిగిన 52 ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్లను మరొక పాఠశాలకు బదిలీ చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. యూపీ స్కూళ్లలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకూ ఉంటాయి. వీటిలో నలుగురైదుగురు స్కూల్‌ ఆసిస్టెంట్లు, ఇద్దరు, ముగ్గురు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌లు పనిచేస్తుంటారు. ఇప్పుడు స్కూలు అసిస్టెంట్లను వేరే పాఠశాలలకు పంపింస్తుండడంతో ఎనిమిది తరగతులను కేవలం ఇద్దరు, ముగ్గురు ఎస్‌జీటీలు మాత్రమే చూసుకోవలసి ఉంటుంది. 6,7,8 తరగతులకు మ్యాథ్స్‌, సైన్స్‌, సోషల్‌, ఇంగ్లీషు, హిందీ సబ్జక్టులు కూడా వారే బోధించవలసిన పరిస్థితి వస్తుంది. నిబంధనల ప్రకారం ఎస్‌జీటీలు ఆరు నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థులకు బోధించడానికి అవకాశం లేదు. వారు ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు మాత్రమే పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. అయితే స్కూల్‌ అసిస్టెంట్లను బదిలీపై పంపిస్తుండడం వల్ల వీరు సబ్జక్టు టీచర్ల అవతారం ఎత్తవలసి వస్తోంది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో ఐదో తరగతి పూర్తయినవారు ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరో తరగతిలో చేరుతున్నారు. అయితే స్కూలు అసిస్టెంట్లు లేకపోతే కొత్తగా ప్రవేశాలు ఉండవు. రానున్న కాలంలో విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గిపోయి ఆయా పాఠశాలలు కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని ఉపాధ్యాయులు అంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో 99 మంది కంటే తక్కువ విద్యార్థులు వున్న 52 యూపీ స్కూళ్లలో స్టూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 182 వరకూ ఉన్నాయి. వీరు ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు వివిధ సబ్జక్టులు బోధిస్తున్నారు. ఇందులో ఒక్క విశాఖ జిల్లాలోనే 24 యూపీ స్కూళ్లు ఉన్నాయి. ఆనందపురం మండలం దబ్బందలో 12 మంది, భీమిలి మండలం పెదనాగమయ్యపాలెంలో 29 మంది, చినగదిలి మండలం పితానివానిపాలెంలో 29 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వీటిల్లో ఎనిమిదో తరగతిలో ఒక్క విద్యార్థి కూడా లేడు. మిగిలిన పాఠశాలల్లో దాదాపు 80 మంది పైబడి ఉన్నారు. ఒక్కొక్క పాఠశాలలో కనీసం ఇద్దరు స్కూలు అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. వారంతా తప్పనిసరిగా బదిలీ కావల్సి వుంటుందని అంటున్నారు. అలాగే ఆనందపురం మండలం వెంకటాపురం యూపీ స్కూల్‌లో 3 నుంచి 8వ తరగతి వరకు 98 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్క విద్యార్థి తక్కువని ఈ పాఠశాలలో ఇద్దరు స్కూలు అసిస్టెంట్లను తరలిస్తున్నారు. అదేవిధంగా భీమిలి మండలం అన్నవరం యూపీ స్కూలులో 95 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ నలుగురు స్కూలు అసిస్టెంట్లను తరలిస్తున్నారు.

2022 ఆగస్టు 31 నాటికి 98 మంది పైబడి విద్యార్థులు లేని ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీ తప్పనిసరి అని ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో చాలామంది ఉపాధ్యాయులు బదిలీ అయిపోతున్నారు. ఎనిమిది సంవత్సరాలు అదే పాఠశాలలో పనిచేసేందుకు వచ్చినవారు కేవలం రెండేళ్లలోనే మారుమూల ప్రాంతాలకు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. కొంతమంది వచ్చిన రెండేళ్లకే బదిలీ అయిపోతున్నందున మార్కులు ఉండడం లేదు. రెండేళ్లలోపు పదవీ విరమణ చేయనున్న పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. అందువల్ల వీరికి ప్రిఫరెన్షియల్‌ కేటగిరీలో వారు పనిచేస్తున్న మండలంలో వేరే పాఠశాలకు బదిలీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.

Updated Date - 2023-06-01T00:34:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising