ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల నిరసన

ABN, First Publish Date - 2023-03-22T01:53:26+05:30

డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులు మంగళవారం వర్క్‌ టు రూల్‌ పాటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వర్క్‌ టు రూల్‌ ప్రారంభం

సాయంత్రం ఐదు గంటలకు మూతపడిన ప్రభుత్వ కార్యాలయాలు

విశాఖపట్నం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి):

డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులు మంగళవారం వర్క్‌ టు రూల్‌ పాటించారు. జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాలతోపాటు డివిజనల్‌, తహసీల్దార్‌ కార్యాలయాలు, కలెక్టరేట్‌లో పలువురు ఉద్యోగులు ఉదయం 10.30 గంటలకు విధులకు హాజరై సాయంత్రం ఐదు గంటలకు నిష్క్రమించారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గం నుంచి వచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఉద్యోగులు తెలిపారు. ఏపీ జేఏసీ అమరావతిలో భాగస్వాములుగా వున్న మిగిలిన కార్యాలయాల్లోని ఉద్యోగులు కూడా సాయంత్రం ఐదు గంటలకు వెళ్లిపోయారు. దీంతో అనేక కార్యాలయాలు సాధారణ రోజులతో పోలిస్తే భిన్నంగా కనిపించాయి. సాధారణంగా ఉద్యోగులు ఆయా కార్యాలయాల్లో ఉన్న పనిని బట్టి వేగంగా రావడం, ఆలస్యంగా వెళ్లడం వంటివి చేస్తుంటారు. కానీ ఉద్యోగులు వర్క్‌ టు రూల్‌ పాటించడంతో తహసీల్దార్‌, ఇతర రెవెన్యూ కార్యాలయాలు సాయంత్రం బోసిపోయి కనిపించాయి. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-03-22T01:53:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising