ఏలేరు కాలువ గండి పూడ్చివేతకు ఆటంకం
ABN, First Publish Date - 2023-08-02T01:04:35+05:30
మండలంలోని రాచపల్లి 100 కిలో మీటరు వద్ద ఏలేరు కాలువకు పడిన గండి వల్ల రెండవ రోజైన మంగళవారం కూడా నీరు వృథాగా పోయింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో సుమారు నాలుగుమీటర్లు వెడల్పున ఏలేరు కాలువకు గండి పడిన విషయం తెలిసిందే.
వర్షం కురుస్తుండడంతో సాగని పనులు
రెండవ రోజూ వృథాగా పోయిన నీరు
మాకవరపాలెం, ఆగస్టు 1: మండలంలోని రాచపల్లి 100 కిలో మీటరు వద్ద ఏలేరు కాలువకు పడిన గండి వల్ల రెండవ రోజైన మంగళవారం కూడా నీరు వృథాగా పోయింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో సుమారు నాలుగుమీటర్లు వెడల్పున ఏలేరు కాలువకు గండి పడిన విషయం తెలిసిందే. అయితే గండి పనులు చేపట్టేందుకు ఏలేరు శాఖ అధికారులతో పాటు జీవీఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. నీటి ప్రభావం తగ్గేందుకు 94 మైలురాయి వద్ద ఏలేరు నీరు గెడ్డలో పోయేలా కాలువకు గండి కొట్టారు. అయితే మంగళవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుండడంతో పనులు ముందుకు సాగలేదు. మట్టిని తరలించేందుకు వాహనాలు అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో గండి పూడ్చే పనులను నిలిపివేశారు. ఏలేరు కాలువ గట్టు వర్షానికి పూర్తిగా బురదమయం కావడంతో లారీలు అక్కడికి వెళ్లడం లేదు. దీని వల్ల మట్టిని తరలించే అవకాశం లేకుండాపోయింది. ఇప్పటికే సుమారు 90 క్యూసెక్కుల నీరు వృథాగా పోయిందని ఏలేరు శాఖ అధికారులు చెబుతున్నారు. గండి పనులు పూర్తి చేయాలంటే మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
Updated Date - 2023-08-02T01:04:35+05:30 IST