ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి

ABN, First Publish Date - 2023-06-26T23:05:11+05:30

డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని, అప్పుడే ఆరోగ్యవంతమైన భవిష్యత్తు ఉంటుందని ఏఎంఏఎల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జి.జయబాబు అన్నారు.

అనకాపల్లిలో డీఎస్పీ కార్యాలయం కూడలి వద్ద మానవహారంగా ఏర్పడిన విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనకాపల్లి(కొత్తూరు), జూన్‌ 26 : డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని, అప్పుడే ఆరోగ్యవంతమైన భవిష్యత్తు ఉంటుందని ఏఎంఏఎల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జి.జయబాబు అన్నారు. స్థానిక ఏఎంఏఎల్‌ కళాశాలలో ప్రపంచ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాదక ద్రవ్యాల నిరోధకత, దాని ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. అనంతరం కళాశాల నుంచి డీఎస్పీ కార్యాలయం కూడలి వద్ద వరకు ర్యాలీ నిర్వహించి, మానవహారంగా ఏర్పడ్డారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మహేశ్వరరావు, ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్‌ నిరంజన్‌కుమార్‌, ఎన్‌సీసీ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

-పరవాడ మండలం వాడచీపురుపల్లి హైస్కూల్‌లో హెచ్‌ఎం పి. కనకేశ్వరరావు ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

-ఎలమంచిలిలో ప్రపంచ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ, మానవహారం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో న్యాయమూర్తులు పి.స్వాతి భవానీ, టి.వీరరాఘవేంద్రరావు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.ఎస్‌.పట్నాయక్‌, న్యాయవాది పీవీ.రమణ, ప్రిన్సిపాల్‌ సరోజని పాల్గొన్నారు. అదే విధంగా ఎలమంచిలి ప్రధాన రోడ్డుపై జరిగిన మరో కార్యక్రమంలో సీఐ గఫూర్‌, ఎస్‌ఐ పాపినాయుడు, సన్నిబాబు, వెంకట్రావు విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించారు.

-రాంబిల్లి పోలీసుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎస్‌ఐ దీనబందు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

-ఎస్‌.రాయవరం మండలం అడ్డరోడ్డులో సోమవారం ఎస్‌ఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వాడకం వలన కలిగే నష్టాల గురించి వివరిస్తూ కళాశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నక్కపల్లి ఎస్‌ఐ శిరీష తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:05:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising