ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేటి నుంచి ఇంటింటా ఓటరు సర్వే

ABN, First Publish Date - 2023-07-21T01:12:08+05:30

జిల్లాలో శుక్రవారం నుంచి చేపట్టనన్న ఇంటింటా ఓటరు సర్వే కార్యక్రమానికి ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి కోరారు. గురువారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు బూత్‌ స్థాయి అధికారులతో (బీఎల్‌ఓలు) ఇంటింటా ఓటరు సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. బీఎల్‌వోలు తమ పరిధిలో వున్న ప్రతి ఇంటికి ఓటరు జాబితాలతో వెళ్లి, లిస్టులో పేర్లు వున్న వ్యక్తుల గురించి ఆరా తీస్తారని చెప్పారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి

ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలి

కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి

అనకాపల్లి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్రవారం నుంచి చేపట్టనన్న ఇంటింటా ఓటరు సర్వే కార్యక్రమానికి ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి కోరారు. గురువారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు బూత్‌ స్థాయి అధికారులతో (బీఎల్‌ఓలు) ఇంటింటా ఓటరు సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. బీఎల్‌వోలు తమ పరిధిలో వున్న ప్రతి ఇంటికి ఓటరు జాబితాలతో వెళ్లి, లిస్టులో పేర్లు వున్న వ్యక్తుల గురించి ఆరా తీస్తారని చెప్పారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల్లో నమోదై ఉన్నా, అర్హులైన వారి పేర్లు జాబితాలో లేకపోయినా పరిశీలించి సరిచేస్తారన్నారు. అదే విధంగా 18 ఏళ్లు నిండిన వారిని గుర్తిస్తారని చెప్పారు. తుది ఓటరు జాబితాలను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేస్తామని, అయినప్పటికీ సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు పది రోజుల ముందు వరకు ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. అర్హులైన వారంతా ఓటరుగా నమోదు చేసుకొనేందుకు రాజకీయ పార్టీలు అవగాన కల్పించాలన్నారు. ఒకే ఓటరు పేరు ఒకటికన్నా ఎక్కువచోట్ల నమోదై ఉంటే.. ఆ మేరకు రాజకీయ పార్టీ నాయకుల వివరాలు అందజేస్తే పరిశీలించి సరిచేస్తామన్నారు. సర్వే కోసం ఇళ్లకు వచ్చే బీఎల్‌ఓలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. అనంతరం పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ పి.వెంకటరమణ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ లక్ష్మీదేవి, ఎన్నికల డీటీ రవికుమార్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు వి.నరసింగరావు (బీజేపీ), బి.శ్రీనివాసరావు (టీడీపీ), ఎస్‌వీవీ రామచంద్ర (బీఎస్పీ), కె.హరినాథబాబు (ఆమ్‌ ఆద్మీ), తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T01:12:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising