ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరపల్లిలో అతిసార

ABN, First Publish Date - 2023-05-26T01:09:06+05:30

గూడెంకొత్తవీధి మండలం వంచుల పంచాయతీ చెరపల్లి గ్రామంలో అతిసార ప్రబలింది. బుధవారం సాయంత్రం నుంచి గ్రామానికి చెందిన 31 మంది గిరిజనులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. గురువారం ఉదయానికి పరిస్థితి తీవ్రంగా మారడంతో ఏడుగురిని చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా చెరపల్లి గ్రామంలో అతిసార ప్రబలిన విషయం తెలుసుకున్న జర్రెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఎండీ మజీద్‌, వైద్య సిబ్బందితో గ్రామానికి వెళ్లి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న 24 మందికి చికిత్స అందించారు. డాక్టర్‌ మజీద్‌ తెలిపిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన సుమారు 40 మంది ఆదివాసీలు బుధవారం సామూహిక భోజనాలు చేశారు.

చింతపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతిసార బాధితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

31 మందికి వాంతులు, విరేచనాలు

ఏడుగురికి తీవ్ర అస్వస్థత

చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలింపు

ప్రాణాపాయం లేదన్న వైద్యులు

చెరపల్లిలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు

చింతపల్లి/గూడెంకొత్తవీధి, మే 25: గూడెంకొత్తవీధి మండలం వంచుల పంచాయతీ చెరపల్లి గ్రామంలో అతిసార ప్రబలింది. బుధవారం సాయంత్రం నుంచి గ్రామానికి చెందిన 31 మంది గిరిజనులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. గురువారం ఉదయానికి పరిస్థితి తీవ్రంగా మారడంతో ఏడుగురిని చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా చెరపల్లి గ్రామంలో అతిసార ప్రబలిన విషయం తెలుసుకున్న జర్రెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఎండీ మజీద్‌, వైద్య సిబ్బందితో గ్రామానికి వెళ్లి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న 24 మందికి చికిత్స అందించారు. డాక్టర్‌ మజీద్‌ తెలిపిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన సుమారు 40 మంది ఆదివాసీలు బుధవారం సామూహిక భోజనాలు చేశారు. కొద్దిసేపటి తరువాత వాంతులు, విరేచనాలు ప్రారంభం అయ్యాయి. నిల్వ వుంచిన, లేదా ఆహారంలో కల్తీ కారణంగా వాంతులు విరేచనాలకు గురైవుంటారని తెలిపారు. అతిసార పూర్తిగా తగ్గేవరకు గ్రామంలో శిబిరాన్ని కొనసాగిస్తామని వైద్యాధికారి తెలిపారు.

చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో చికిత్స

వంచుల పంచాయతీ చెరపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు, మరో ఐదుగురు పెద్దలకు వాంతులు, విరేచనాలతో ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా వుండడంతో కుటుంబ సభ్యులు గురువారం ఉదయం చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వీరిలో అరడ జెస్సీ(5), అర్పిత(8), వెంకాయమ్మ, గాబ్రియేలు, రవివర్మ, సంతోషకుమారి, అరడ రాణి వున్నారు. ఆస్పత్రి వైద్యులు సెలైన్లు పెట్టి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, క్రమంగా కోలుకుంటున్నారని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.ఆదిత్య కీర్తి తెలిపారు. మరో మూడు రోజులపాటు ఆస్పత్రిలోనే చికిత్స పొందాలన్నారు. కాగా చెరపల్లిలో అతిసార ప్రబలిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి చింతపల్లి, జీకేవీధి ఎంపీపీలు కోరాబు అనుషదేవి, బోయిన కుమారిలతో కలిసి ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. వారికి పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వెంట వైసీపీ మండల అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్‌, పీఏసీఎస్‌ చైర్‌పర్సన్‌ వసుపరి ప్రసాద్‌, వైస్‌ ఎంపీపీ సప్పగెడ్డ ఆనంద్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-05-26T01:09:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising