ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ రంగంతోనే అభివృద్ధి

ABN, First Publish Date - 2023-01-18T00:11:23+05:30

స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలో వుంటేనే అభివృద్ధి జరుగుతుందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు జె.రామకృష్ణ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 705వ రోజుకు చేరాయి.

దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న రామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు జె.రామకృష్ణ

కూర్మన్నపాలెం, జనవరి 17: స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలో వుంటేనే అభివృద్ధి జరుగుతుందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు జె.రామకృష్ణ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 705వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించబోమని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసేంత వరకు తాము పోరాటాలను కొనసాగిస్తామన్నారు. ఉక్కు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 30న నిర్వహించనున్న కార్మిక ప్రజా గర్జనలో అన్ని వర్గాల వారు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ మొండి వైఖరిని విడనాడాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎన్‌.రామారావు, వరసాల శ్రీనివాసరావు, కె.పరంధామయ్య, సన్యాసిరావు, శ్రీనివాసనాయుడు, గుమ్మడి నరేంద్ర, డేవిడ్‌, తదితరులతో పాటు డబ్ల్యూఆర్‌ఎం విభాగం ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-18T00:11:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising