ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తరుగుతున్న నీటి నిల్వలు

ABN, First Publish Date - 2023-06-16T01:46:05+05:30

గత కొద్దిరోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో నగరంలో నీటి వినియోగం పెరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే ఇంచుమించు అన్ని రిజర్వాయర్‌లలోనూ తక్కువగా నిల్వలు

సెప్టెంబరు వరకూ ఢోకా లేదంటున్న జీవీఎంసీ అధికారులు

వర్షాలు తగ్గితే కష్టాలు తప్పవంటున్న నిపుణులు

ఇప్పటి నుంచే యాక్షన్‌ప్లాన్‌ తయారుచేసుకోవాలని సూచన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

గత కొద్దిరోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో నగరంలో నీటి వినియోగం పెరిగింది. ఆ కారణగా రిజర్వాయర్లలో నిల్వలు రోజురోజుకీ తగ్గుతున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి రిజర్వాయర్లలో వున్న నీటి మట్టాలతో పోల్చితే ఈ ఏడాది కాస్త తక్కువగా ఉండడం జీవీఎంసీ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.

నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం ప్రతిరోజూ 80 మిలియన్‌ గ్యాలన్లు (ఎంజీడీ) నీరు అవసరం. పారిశ్రామిక అవసరాలకు మరో 50 ఎంజీడీలు కావాలి. నగర అవసరాలకు ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లా ఏలేరు రిజర్వాయర్‌ నుంచి 60 నుంచి 80 ఎంజీడీలు తీసుకుంటుండగా మిగిలిన నీటిని రైవాడ, ముడసర్లోవ, తాటిపూడి, గంభీరం రిజర్వాయర్లతోపాటు గోస్తనీ నది నుంచి తీసుకుంటున్నారు. గత రెండేళ్లు సాధారణం కంటే అధిక వర్షాలు కురవడంతో రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా చేరింది. దీంతో గత ఏడాది వేసవిలో తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. అయితే ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. దీనిప్రభావం నగరంలో భూగర్భ జలాలపై పడింది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లపై ఆధారపడిన వారంతా కొళాయి నీటిని వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఎండ తీవ్రతకు రిజర్వాయర్లు, ఏలేరు, రైవాడ రిజర్వాయర్ల నుంచి ఓపెన్‌ కాలువ ద్వారా వచ్చే నీరు కొంత ఆవిరవ్వడం జరుగుతోంది. దీంతో రిజర్వాయర్‌ నుంచి అదనంగా నీటిని కాలువల్లోకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వాయర్లలో నీటి మట్టాలు వేగంగా తగ్గుతున్నాయి. గత ఏడాది జూన్‌ 12వ తేదీతో ఉన్న నిల్వలతో పోల్చితే...ఈ ఏడాది జూన్‌ 12న అన్ని రిజర్వాయర్లలో నీటిమట్టాలు తక్కువగా ఉన్నాయి. నగరానికి నీరు సరఫరా చేసే ప్రధాన వనరు అయిన ఏలేరు రిజర్వాయర్‌లో గత ఏడాది జూన్‌ 12న 76.94 మీటర్లు నీరు ఉండగా, ప్రస్తుతం 76.76 మీటర్లు మేర ఉంది. అలాగే రైవాడ రిజర్వాయర్‌లో గత ఏడాది జూన్‌ 12న 109.59 మీటర్లు నీటిమట్టం ఉంటే ప్రస్తుతం 108.14 మీటర్లు ఉంది. మేహాద్రిగెడ్డలో గత ఏడాది జూన్‌ 12 నాటికి 53.9 అడుగులు ఉంటే...ప్రస్తుతం 52.8 అడుగులు, తాటిపూడి రిజర్వాయర్‌లో గత ఏడాది 291.5 అడుగులు ఉండగా ప్రస్తుతం 289.2 అడుగులు ఉంది. రిజర్వాయర్లలో ప్రస్తుతం వున్న నిల్వలు ఈ ఏడాది సెప్టెంబరు వరకూ సరిపోతాయని జీవీఎంసీ అధికారులు ధీమాగానే చెబుతున్నా...మరో రెండు నెలల్లో వర్షాలు సాధారణ స్థాయిలో కురవకపోతే ఇబ్బందులు ఎదురుకావచ్చునని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ‘ఎల్‌నినో’ వల్ల నైరుతి సీజన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని పేర్కొంటుండడం అందరినీ ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు భవిష్యత్తులో నీటికి ఇబ్బంది తలెత్తకుండా ఇప్పటి నుంచే తగిన కార్యాచరణ రూపొందించి అమలుచేయాలని పలువురు సూచిస్తున్నారు.

రిజర్వాయర్లలో ప్రస్తుత నీటిమట్టం

రిజర్వాయర్‌ గరిష్ఠం కనిష్ఠం 12-6-22 12-6-23

ఏలేరు 86.56 మీటర్లు 72.54 మీటర్లు 76.94 76.76

రైవాడ 114 మీటర్లు 99 మీటర్లు 109.59 108.14

మేహద్రిగెడ్డ 61 అడుగులు 44 అడుగులు 53.9 52.8

తాటిపూడి 297 అడుగులు 251 అడుగులు 291.5 289.2

గోస్తనీ 35 అడుగులు 21.6 అడుగులు 31 26.5

ముడసర్లోవ 169 అడుగులు 152 అడుగులు 163.06 163.02

గంభీరం 126 అడుగులు 107 అడుగులు 117 119

Updated Date - 2023-06-16T01:46:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising