ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఎన్‌ రోడ్డుపై ప్రమాదాలకు కాంట్రాక్టర్‌, ఆర్‌అండ్‌బీ అధికారులే బాధ్యత వహించాలి

ABN, First Publish Date - 2023-01-18T00:02:25+05:30

అసంపూర్తిగా పనులు చేసి వదిలేయడమే కాకుండా కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయని కాంట్రాక్టర్‌, ఆర్‌అండ్‌బీ అధికారులే బాధ్యత వహిం చాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.గోవిందరావు డిమాండ్‌ చేశారు.

విలేకరులతో మాట్లాడుతున్న గోవిందరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రావికమతం, జనవరి 17: అసంపూర్తిగా పనులు చేసి వదిలేయడమే కాకుండా కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయని కాంట్రాక్టర్‌, ఆర్‌అండ్‌బీ అధికారులే బాధ్యత వహిం చాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.గోవిందరావు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మేడివాడ సంతబయలు, పెద్ద చెరువు, పి.పొన్నవోలు, టి.అర్జాపురం పలుచోట్ల కల్వర్టు మదుంల కోసం గొయ్యిలు తవ్వి గొట్టాలు వేసి, పూడ్చకుండా కాంట్రాక్టర్‌ నెలలు తరబడి నిర్లక్ష్యంగా వదిలేశారన్నారు. కనీసం ఈ గోతుల వద్ద హెచ్చరిక బోర్డులుగాని, రేడియం సిక్కర్లుగాని ఏర్పాటు చేయలేదన్నారు. దీంతో రాత్రి సమయాల్లో ఈ గొయ్యిల్లో వాహనదారులు పడిపోయి ప్రాణాలు పోగొట్టుకుం టున్నారన్నారు. సోమవారం రాత్రి కోటవురట్లకు చెందిన గట్టి వీరరాఘవులు గొయ్యిలో పడి మృత్యవాత పడిన సంగతి తెల్సిందేన్నారు. తక్షణమే అసంపూర్తిగా నిర్మాణాల్లో ఉన్న కల్వర్టు పనులు పూర్తి చేయాలని, మరో ప్రాణం పోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మృతుడి కుటుంబానికి కాంట్రాక్టర్‌, రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని గోవిందరావు హెచ్చరించారు.

Updated Date - 2023-01-18T00:02:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising