ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన సౌత్‌జోన్‌ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు

ABN, First Publish Date - 2023-01-26T00:14:59+05:30

ఈస్ట్‌ పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌లో జరిగిన సౌత్‌జోన్‌ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు బుధవారం ముగిశాయి.

విజేతలుగా నిలిచిన చిన్నారులతో అతిఽథులు ప్రశాంత్‌ సాగి, రామారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం(స్పోర్ట్సు), జనవరి 25: ఈస్ట్‌ పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌లో జరిగిన సౌత్‌జోన్‌ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు బుధవారం ముగిశాయి. రెండు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో ఎనిమిదేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు బాలబాలికలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో దక్షిణ ఆంధ్ర నుంచి 72 మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభను ప్రదర్శించారు. టోర్నీ ముగింపు కార్యక్రమానికి ఈస్ట్‌ పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌ కార్యదర్శి ప్రశాంత్‌ సాగి, ఉపాధ్యక్షుడు సీపీ రామారావు ముఖ్య అతిఽఽథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేసి అభినందించారు.

విజేతలు: బాలుర అండర్‌-8 విభాగంలో వివాన్‌ సింగ్‌, అరిహంత్‌ జోషి, అద్విక్‌ పాండే; 9-10 ఏళ్ల కేటగిరీలో బవిన్‌ బోయపాటి, ఽధ్రువ్‌ కేశిరెడ్డి, కనవ్‌ కర్ణాని; 11-12 విభాగంలో సాత్విక్‌ కుమార్‌ సింగ్‌, సుజన్‌ చౌడా నగేష్‌, ఆదిత్య మంత్రి ప్రగడ; 13-14 కేటగిరీలో పి.ముకుల్‌, వివాన్‌ ఉభయాంకర్‌, ఆరుష్‌ నవీన్‌; 15-17 ఏళ్ల విభాగంలో సౌరవ్‌ పారుతి, జి.మధు, కృష్ణలాల్‌ అగర్వాల్‌; 18 ప్లస్‌ ఏళ్ల విభాగంలో అర్యవ్‌ షా, పవన్‌ పారుతి, సుమిత్‌ చంద్ర ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించారు.

బాలికల అండర్‌-8 విభాగంలో సమీరా హందా, జునో కల్యాణి, ప్రమతి వీర; 9-10 ఏళ్ల విభాగంలో ఆలియారామ్‌ బాలాజీ; 11-12 ఏళ్ల విభాగంలో రియాంచ తిమ్మయ్య, అవిజ్ఞ సదాశివన్‌ ఉన్ని, వర్ణికా గుప్తా; అండర్‌ 13-14 కేటగిరీలో జి.అమూల్య, అనికా వివేక్‌, ఎం.అనూష; 15-17 ఏళ్ల విభాగంలో అనన్య ఖోశ్లా, యు.అఖిల, ఈ.ప్రిసిల్లా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించారు.

Updated Date - 2023-01-26T00:15:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising