ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి

ABN, First Publish Date - 2023-02-07T04:01:04+05:30

మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చట్ట సభల్లో మహిళల ప్రాధాన్యం మరింత పెరగాలి

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

విశాఖపట్నం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నగరంలో జరుగుతున్న మహిళా ఎమ్మెల్యేల సదస్సు ముగింపు కార్యక్రమంలో సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ‘షీ ఈజ్‌ ఏ ఛేంజ్‌ మేకర్‌ (ఆమె మార్పునకు కారకురాలు) అనే అంశంపై ప్రసంగించారు. చట్ట సభల్లో మహిళల ప్రాధాన్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గతంతో పోలిస్తే రాజకీయాల్లోకి వచ్చే మహిళల సంఖ్య పెరిగిందని, అయితే మరింత పెరగాల్సిన అవసరముందన్నారు. పాన్‌ ఇండియా కెపాసిటీ బిల్డింగ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు అవకాశం ఏర్పడుతుందంటూ ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్న మహిళా కమిషన్‌ను ఆయన అభినందించారు. జాతీయ మహిళా కమిషన్‌ చైర్మన్‌ రేఖా శర్మ మాట్లాడుతూ మహిళా సాధికారితకు ఎంతగానో కృషిచేస్తున్నామన్నారు.

Updated Date - 2023-02-07T04:01:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising