అచ్యుతాపురం రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన కలెక్టర్
ABN, First Publish Date - 2023-07-08T00:27:40+05:30
అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు విస్తరణ పనులను జిల్లా కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి శుక్రవారం పరిశీలించారు.
మునగపాక, జూలై 7: అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు విస్తరణ పనులను జిల్లా కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి శుక్రవారం పరిశీలించారు. అనకాపల్లి బైపాస్ నుంచి మునగపాక, అచ్యుతాపురం మండలాలలో పలు ప్రాంతాలలో రోడ్డు, కల్వర్టులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఇటీవల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఏషియన్ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమై రోడ్డు నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఈ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి, నివేదిక తయారు చేసి ఆర్‌అండ్‌బీ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే భూసేకరణ, ఏఏ ప్రాంతాలకు ఎంత నష్ట పరిహారం వంటి ప్రక్రియ పూర్తయ్యింది. నష్టపరిహారం చెల్లింపులో జాప్యంపై భూ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్ని మంత్రి అమర్‌నాథ్, ఎమ్మెల్యే కన్నబాబుల దృష్టికి తీసుకువెళ్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ అంశంపై కదలిక వచ్చింది. ఈ వారంలో జిల్లా కలెక్టర్ ఆర్‌అండ్‌బీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన తర్వాత రోడ్డు పనులు వేగవంతం అవుతాయి.
Updated Date - 2023-07-08T00:27:40+05:30 IST