నిబంధనలకు వైసీపీ తిలోదకాలు
ABN, First Publish Date - 2023-02-21T00:46:03+05:30
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా అధికార పార్టీ నాయకులు నిబంధనలకు తిలోదకాలిచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తాజా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఆరోపించారు.
అరకులోయ, ఫిబ్రవరి 20: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా అధికార పార్టీ నాయకులు నిబంధనలకు తిలోదకాలిచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తాజా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. సోమవారం అరకులోయలోని బీవీకే పాఠశాలలో అరకులోయ, డుంబ్రిగుడ మండలాల బీజేపీ నాయకులతో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయూ వీసీ ఆధ్వర్యంలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సమావేశాన్ని వైసీపీ నాయకులు నిర్వహిం చడం దారుణమన్నారు. అలాగే వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, మరో వైపు మంత్రులు వారి శాఖల్లో పని చేసే ఉద్యోగులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారన్నారు. తాను గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానని, రెండో సారి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఈ సమావేశంలో అరకులోయ, డుంబ్రిగుడ మండలాల పార్టీ ప్రతినిధులకు ఓటింగ్ విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాంగి రాజపారావు, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఉమాహేశ్వరరావు, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల అధ్యక్షులు రామయందర్‌రావు,ధర్మరాజు, ఎస్పీమోర్చా జోనల్ ఇన్‌చార్జి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-21T00:46:04+05:30 IST