ఐఓసీలో తప్పిన పెను ప్రమాదం
ABN, First Publish Date - 2023-09-21T23:48:16+05:30
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)లో గురువారం పెను ప్రమాదం తప్పింది. ట్యాంకర్లకు చమురు నింపే పంప్ ఒక్కసారిగా పగిలిపోవడంతో వేలాది లీటర్ల చమురు నింగిలోకి ఎగిసి రోడ్డు మీద పడింది.
మల్కాపురం, సెప్టెంబరు 21 : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)లో గురువారం పెను ప్రమాదం తప్పింది. ట్యాంకర్లకు చమురు నింపే పంప్ ఒక్కసారిగా పగిలిపోవడంతో వేలాది లీటర్ల చమురు నింగిలోకి ఎగిసి రోడ్డు మీద పడింది. ఆ సమయంలో సమీపంలో నిప్పు రవ్వలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం పది గంటల సమయంలో ఓ ఆయిల్ ట్యాంకర్‌కు చమురు నింపేందుకు పైప్ పెట్టారు. ట్యాంక్‌లో చమురు నిండుతుండగా డ్రైవర్ ట్యాంకర్‌ను సడన్‌గా ముందుకు తీసేసాడు. దీంతో ట్యాంకర్‌కు ఏర్పాటు చేసిన పైప్‌లైన్ పగిలిపోవడంతో వేలాది లీటర్ల చమురు బయటకు తన్నుకొచ్చింది. అదే సమయంలో అక్కడే ఉన్న మరో డ్రైవర్ ఆరీఫ్ (50) పై చమురు పడడంతో ఆయన శరీరం అంతా బొబ్బర్లు వచ్చాయి. వెంటనే సమీపంలో ఉన్న సహో ద్యోగులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా చమురు రోడ్డు మీద పడడంతో సుమారు రెండుమూడు గంటల పాటు చమురు లోడింగ్ నిలుపుదల చేశారు.
Updated Date - 2023-09-21T23:48:16+05:30 IST