భరత్ తెలుగు ప్రజలకు గర్వకారణం
ABN, First Publish Date - 2023-06-24T00:40:32+05:30
అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు కేఎస్ భరత్ తెలుగు ప్రజలకు గర్వకారణమని ఏసీఏ కార్యదర్శి గోపీనాఽథ్‌రెడ్డి అన్నారు. వర్థమాన అంతర్జాతీయ క్రికెట్ వికెట్ కీపర్ భరత్‌ను శుక్రవారం పీఎంపాలెం ఏసీఏవీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఘనంగా సత్కరించారు.
మధురవాడ, జూన్ 23 : అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు కేఎస్ భరత్ తెలుగు ప్రజలకు గర్వకారణమని ఏసీఏ కార్యదర్శి గోపీనాఽథ్‌రెడ్డి అన్నారు. వర్థమాన అంతర్జాతీయ క్రికెట్ వికెట్ కీపర్ భరత్‌ను శుక్రవారం పీఎంపాలెం ఏసీఏవీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గోపీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ భరత్ నగరంలో క్రికెట్‌లో ఓనమాలు దిద్దుకుని అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున వికెట్ కీపర్‌గా రాణించడం గర్వించదగ్గ విషయమన్నారు. మాజీ ఎమ్మెల్యే విష్టుకుమార్‌రాజు మాట్లాడుతూ ఇంతవరకు వీడీసీఏ నుంచి 16 మంది క్రీడాకారులు భారత్ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించారన్నారు. సన్మాన గ్రహీత భరత్ మాట్లాడుతూ తన ఉన్నతికి కారణమైన ఏడీసీఏ, వీసీఏ సహకారం మరువలేనిదన్నారు. అనంతరం ఏసీఏవీడీసీఏ ప్రతినిధులు భరత్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ శివారెడ్డి, పార్థసారధి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-24T00:40:32+05:30 IST