ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోకేశ్‌ పాదయాత్రకు ఇన్ని అడ్డంకులా ?

ABN, First Publish Date - 2023-01-26T01:05:42+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్రకు ప్రభు త్వం అడుక్కొక ఆంక్ష విధించడం దుర్మార్గమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగ జగదీశ్వరరావు విమ ర్శించారు.

విలేకరులతో మాట్లాడుతున్న జగదీశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాలనే లేనిపోని ఆంక్షలు

ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. పాదయాత్రను విజయవంతం చేస్తాం

టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగ జగదీశ్‌

అనకాపల్లి అర్బన్‌, జనవరి 25 : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్రకు ప్రభు త్వం అడుక్కొక ఆంక్ష విధించడం దుర్మార్గమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగ జగదీశ్వరరావు విమ ర్శించారు. బుధవారం ఆయన ఇక్కడి పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లా డారు. పాదయాత్రను అడ్డుకోడానికి జగన్‌ ప్రభుత్వం లేనిపోని ఆంక్షలు విధిస్తుందని ఆరోపించారు. పాదయాత్రకు మూడు రోజు లు మాత్రమే అనుమతి ఇచ్చారని, నాడు జగన్‌ పాదయాత్రకు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఒకేసారి అను మతి ఇచ్చారని గుర్తు చేశారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై సభ నిర్వహించాలంటే డీఎస్‌పీ అనుమతితోనే ఏర్పాటు చేసుకోవాలన్న నిబంధన దురుద్దేశ మని, ఇదంతా ముఖ్యమంత్రి పెట్టిన నిబంఽ దనలని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంక్షలు విధించడం శాంతి భద్రతల సాకుతో పాదయాత్రను ఆపడానికి చేస్తున్న పన్నాగమని ఆరోపించారు. ప్రభు త్వానికి ధైర్యం ఉంటే పాద యాత్రకు పూర్తిస్థాయిలో అనుమతి ఇవ్వా లని డిమాండ్‌ చేశారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసుల విఽధులను కూడా నిర్వాహకులకే అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్రను విజయవంతం చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఆయనతో పాటు పార్టీ నాయకుడు కుప్పిలి జగన్‌ ఉన్నారు.

Updated Date - 2023-01-26T01:05:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising