ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బకాయిలు విడుదలయ్యేనా?

ABN, First Publish Date - 2023-06-26T01:08:35+05:30

రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ కాలేజీలకు ప్రభుత్వం భారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయి పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాలుగేళ్లుగా పెండింగ్‌ ఫీజులు చెల్లించని ప్రభుత్వం

2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి బకాయిలు

ఏయూ పరిధిలోని వంద డిగ్రీ కాలేజీలకు రూ.30 కోట్ల మేర పెండింగ్‌

మరో 30 పీజీ కాలేజీలకు రూ.20 కోట్లు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ కాలేజీలకు ప్రభుత్వం భారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయి పడింది. 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 60కుపైగా డిగ్రీ కాలే జీలకు రూ.25 నుంచి రూ.30 కోట్ల వరకు, అలాగే 30 పీజీ కాలేజీలకు రూ.8 నుంచి రూ.12 కోట్లు వరకు చెల్లించాల్సి ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ మొత్తా లను చెల్లించాలని కోరుతున్నప్పటికీ స్పందించకపోవడంతో పలు ప్రైవేటు, డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు కోర్టును ఆశ్ర యించాయి. కోర్టు చెల్లించాలని ఆదేశించినప్పటికీ ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులను ఎదు ర్కొంటున్నామని కాలేజీ యాజమాన్యాలు వాపోతున్నాయి.

ఏయూ పరిధిలోని ఓ ప్రముఖ పీజీ కాలేజీకి రాష్ట్ర ప్రభు త్వం రూ.ఏడు కోట్లు బకాయి ఉంది. ఇందులో కొద్దిరోజుల కిందట కొంతమొత్తం జమచేయగా, మరో రూ.నాలుగు కోట్లు రావాల్సి ఉంది. గ్రామీణ జిల్లాలోని మరో పీజీ కాలేజీకి రూ.50 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. కాలేజీ సామర్థ్యాన్ని బట్టి పీజీ కాలేజీలకు రూ.10 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు బకాయిలున్నాయి. డిగ్రీ కాలేజీలకు కూడా ఇంచుమించు ఇదేస్థాయిలో రావాల్సి ఉంది. వీటితో పాటు 2019 కంటే ముందు రెండు విద్యా సంవత్సరాలకు సంబంధించి సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన చెల్లింపులపైనా ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదని కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి.

ఇబ్బందులు తప్పడం లేదు..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ స్థానంలో తీసుకువచ్చిన విద్యా దీవెన పథకంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఫీజులను ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేస్తున్నప్పటికీ సకాలంలో కాలేజీకి సకాలంలో చెల్లించడం లేదన్నారు. కొన్నిసార్లు నిధులను ప్రభుత్వం జమ చేసినట్టు చెబుతున్నా తమ ఖాతాల్లోకి రాలేదని చెబుతున్నారని, ఫీజులు చెల్లించాలని కోరితే సమ స్యలు చెబుతున్నారని యాజమాన్యాలు వాపోతున్నాయి.

Updated Date - 2023-06-26T01:08:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising