వందో రోజుకు చేరుకున్న అన్న క్యాంటీన్
ABN, First Publish Date - 2023-05-11T00:31:27+05:30
పట్టణంలో టీడీపీ ప్రాంతీయ కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ బుధవారం నాటికి వందో రోజుకుని చేరుకుంది.
ఎలమంచిలిలో అన్న క్యాంటీన్ వద్ద భోజనాలు చేస్తున్న జనం
ఎలమంచిలి, మే 10: పట్టణంలో టీడీపీ ప్రాంతీయ కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ బుధవారం నాటికి వందో రోజుకుని చేరుకుంది. టీడీపీ ఎన్నారై మహిళా విభాగం ప్రోత్సాహంతో నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనం పెడుతున్నారని వృద్ధులు, మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ నేతలు నిత్యం పర్యవేక్షణ చేస్తూ అన్న క్యాంటీన్ విజయవంతానికి తమ వంతు సహకారం అందిస్తున్నారు.
Updated Date - 2023-05-11T00:31:27+05:30 IST