ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లా అదనపు ఎస్‌పీగా అనిల్‌ బాధ్యతల స్వీకరణ

ABN, First Publish Date - 2023-05-31T22:40:01+05:30

జిల్లా అదనపు ఎస్‌పీ(అడ్మిన్‌)గా అనిల్‌ పులిపాటి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ అదనపు ఎస్‌పీగా పని చేసిన తుహిన్‌సిన్హాను జిల్లా ఎస్‌పీగా నియమించడంతో ఆ పోస్టు ఖాళీ అయిన విషయం తెలిసిందే.

బాధ్యతలు స్వీకరిస్తున్న అనిల్‌ పులిపాటి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గతంలో చింతపల్లిలో డీఎస్‌పీగా పని చేసిన అనుభవం

మన్యంపై పూర్తి అవగాహన

పాడేరు, మే 31(ఆంధ్రజ్యోతి): జిల్లా అదనపు ఎస్‌పీ(అడ్మిన్‌)గా అనిల్‌ పులిపాటి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ అదనపు ఎస్‌పీగా పని చేసిన తుహిన్‌సిన్హాను జిల్లా ఎస్‌పీగా నియమించడంతో ఆ పోస్టు ఖాళీ అయిన విషయం తెలిసిందే. కాగా గుంటూరు జిల్లా అదనపు ఎస్‌పీగా పని చేస్తున్న అనిల్‌ పులిపాటిని స్థానిక అదనపు ఎస్‌పీ(అడ్మిన్‌)గా ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన చింతపల్లిలో డీఎస్‌పీగా పని చేశారు. అందువల్ల ఆయనకు మన్యంలో మావోయిస్టుల ప్రభావం, శాంతిభద్రతల సమస్యలు, తదితర వ్యవహారాలపై సంపూర్ణ అవగాహన ఉంది. అలాగే ఆయన కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా అందరితో సన్నిహితంగా ఉండడంతో మన్యంలో ఆయనకు మంచి పోలీసు అధికారిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లాలో పోలీసుల సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తానని అనిల్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Updated Date - 2023-05-31T22:40:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising