ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కదంతొక్కిన అంగన్‌వాడీలు

ABN, First Publish Date - 2023-02-07T00:29:00+05:30

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీఐటీయూ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బోనంగి చిన్నయ్యపడాల్‌, వి.ఉమామహేశ్వరరావుల ఆధ్వర్యంలో సోమవారం పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీగా కలెక్టర్‌ కార్యాలయానికి వెళుతున్న అంగన్‌వాడీలు కదంతొక్కిన అంగన్‌వాడీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీ

పాడేరు రూరల్‌, ఫిబ్రవరి 6: అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీఐటీయూ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బోనంగి చిన్నయ్యపడాల్‌, వి.ఉమామహేశ్వరరావుల ఆధ్వర్యంలో సోమవారం పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ కార్యాలయం నుంచి కలెక్టర్‌ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ అంగన్‌వాడీలకు కనీస వసతులు కల్పించని ప్రభుత్వం వారిపై పని ఒత్తిడి పెంచడం, వేధింపులకు గురిచేయడం అన్యాయమన్నారు. సెల్‌ సిగ్నల్స్‌ లేని మన్యం ప్రాంతంలో అనేక రకాల యాప్‌లను తీసుకొచ్చి పనిభారం పెంచడం తగదన్నారు. అంగన్‌వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని, ముఖ హాజరు రద్దు చేయాలని, సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలని తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వారు కలెక్టర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు భాగ్యలక్ష్మి, నాగమ్మ, వెంకటలక్ష్మి, సీఐటీయూ నాయకులు బాలదేవ్‌, అధిక సంఖ్యలో అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:29:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising