ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందుబాటులోకి రాని అగ్రి ల్యాబ్‌

ABN, First Publish Date - 2023-05-10T00:38:21+05:30

సబ్బవరంలో మూడేళ్లు క్రితం చేపట్టిన జిల్లాస్థాయి అగ్రి ల్యాబ్‌ (ఉమ్మడి జిల్లా) భవన నిర్మాణ పనులు ఇంకా కొనసా...తునే వున్నాయి. విద్యుత్‌, ఫ్లోరింగ్‌, ప్లంబింగ్‌, పెయింటింగ్‌ పనులు తుది దశలో వుండగా, ల్యాబ్‌కు అవసరమైన సామగ్రి ఇంకా చేరలేదు. ఈ పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరు కాలేదని తెలిసింది.

అందుబాటులోకి రాని జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్బవరంలో జిల్లాస్థాయి పరిశోధనశాల

నాలుగేళ్ల క్రితం స్థలం కేటాయింపు

ఏడాది తరువాత నిధులు మంజూరు

2021 ఖరీఫ్‌ నాటికి పూర్తవుతుందని పాలకులు వెల్లడి

రెండేళ్లు అవుతున్నా ప్రారంభంకాని వైనం

ఇప్పటికీ ల్యాబ్‌కు చేరని పరికరాలు

సబ్బవరం, మే 8: సబ్బవరంలో మూడేళ్లు క్రితం చేపట్టిన జిల్లాస్థాయి అగ్రి ల్యాబ్‌ (ఉమ్మడి జిల్లా) భవన నిర్మాణ పనులు ఇంకా కొనసా...తునే వున్నాయి. విద్యుత్‌, ఫ్లోరింగ్‌, ప్లంబింగ్‌, పెయింటింగ్‌ పనులు తుది దశలో వుండగా, ల్యాబ్‌కు అవసరమైన సామగ్రి ఇంకా చేరలేదు. ఈ పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరు కాలేదని తెలిసింది.

పంటల సాగులో విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులతోపాటు భూసార పరీక్షల ఫలితాలను రైతులకు మరింత చేరువచేయడానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక సమీకృత వ్యవసాయ ప్రయోగశాలను, జిల్లా మొత్తానికి సబ్బవరంలో ప్రయోగశాలను ఏర్పాటు చేయనున్నట్టు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ప్రకటించింది. వాస్తవంగా జిల్లాస్థాయి ల్యాబ్‌ నిర్మాణానికి టీడీపీ హయాంలోనే అంకురార్పణ జరిగింది. రెవెన్యూ అధికారులు సబ్బవరం సర్వే నంబరు 271లో ఉన్న నర్సరీ స్థలం సుమారు ఐదు ఎకరాలను అగ్రి ల్యాబ్‌ కోసం కేటాయించారు. భవన నిర్మాణానికి, ప్రయోగశాల ఏర్పాటుకు తెలుగుదేశం ప్రభుత్వం రూ.6 కోట్లు కేటాయించింది. ఈలోగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వం మారడంతో ఏడాదిపాటు ఎటువంటి కదలిక లేదు. ఎట్టకేలకు 2020లో వైసీపీ ప్రభుత్వం ల్యాబ్‌ నిర్మాణానికి రూ.3.13 కోట్లు కేటాయించింది. నిర్మాణ పనులను రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు అప్పగించింది. 2021 ఖరీఫ్‌నాటికి ప్రారంభిస్తామని ప్రకటించింది. కానీ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. మూడేళ్లపాటు భవన నిర్మాణం మాత్రమే పూర్తయ్యింది. ఇంకా చిన్నపాటి పనులు మిగిలి వున్నాయి అయితే ల్యాబ్‌కు అవసరమైన పరికరాలు ఇంకా చేరలేదు. అయితే నిధుల కొరత కారణంగా పరికరాలు రాలేదని తెలిసింది.

Updated Date - 2023-05-10T00:38:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising