ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కోడికత్తి కేసులో నిందితుడికి బెయిల్‌ నిరాకరణ

ABN, First Publish Date - 2023-09-27T03:02:44+05:30

వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడిచేసిన జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ విశాఖపట్నం మూడో అదనపు జిల్లా జడ్డి తీర్పు ఇచ్చారు.

విశాఖపట్నం, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడిచేసిన జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ విశాఖపట్నం మూడో అదనపు జిల్లా జడ్డి తీర్పు ఇచ్చారు. ఈ కేసును విజయవాడ నుంచి విశాఖపట్నం ఎన్‌ఐఏ కోర్టుకు బదలాయించిన సంగతి తెలిసిందే. ఇక్కడికొచ్చిన తర్వాత నిందితుడి తరఫు న్యాయవాది అబ్దుల్‌ సలీమ్‌ కోర్టులో వాదనలు వినిపించారు. నిందితుడు ఐదేళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నాడని వివరించారు. స్పెసల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మాత్రం నిందితుడిని దయ తలిచి బెయిల్‌ ఇస్తే తప్పించుకొని పారిపోయే ప్రమాదం ఉందని, మళ్లీ కోర్టుకు వచ్చే అవకాశం లేదన్నారు. ఈ నెల 21న వీరి వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రిజర్వ్‌ చేసిన జడ్జి ఆర్‌వీవీఎస్‌ మురళీకృష్ణ.. ఇప్పటికి ఎనిమిది సార్లు బెయిల్‌ తిరస్కరణకు గురైందని, ఇప్పుడు కూడా బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తున్నామని ప్రకటించారు.

Updated Date - 2023-09-27T03:02:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising