ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు అందుబాటులో ఏరువాక కేంద్రం

ABN, First Publish Date - 2023-04-03T00:54:43+05:30

జిల్లా కేంద్రంలో ఏరువాక కేంద్రం(డాట్‌ సెంటర్‌) ఏర్పాటు చేశామని ఆచార్య ఎన్‌జీరంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ ఎం.సురేశ్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం నూతన జిల్లాల పరిధి రైతులకు సాంకేతిక సేవలందించేందుకు అనువుగా కృషి విజ్ఞాన కేంద్రం, ఏరువాక కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. నూతనంగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో కేవీకే, ఏరువాక కేంద్రం అందుబాటులో లేదన్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పరిధిలోనున్న ఏరువాక కేంద్రాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీ చేశారన్నారు. ఏరువాక కేంద్రం పరిధిలో ఒక కో-ఆర్డినేటర్‌, ఇద్దరు శాస్త్రవేత్తలు ఉంటారన్నారు.

డాక్టర్‌ ఎం. సురేశ్‌ కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- పాడేరులో ఏర్పాటుతో చేరువకానున్న శాస్త్రవేత్తల సేవలు

- ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ డాక్టర్‌ ఎం.సురేశ్‌కుమార్‌

చింతపల్లి, ఏప్రిల్‌ 2: జిల్లా కేంద్రంలో ఏరువాక కేంద్రం(డాట్‌ సెంటర్‌) ఏర్పాటు చేశామని ఆచార్య ఎన్‌జీరంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ ఎం.సురేశ్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం నూతన జిల్లాల పరిధి రైతులకు సాంకేతిక సేవలందించేందుకు అనువుగా కృషి విజ్ఞాన కేంద్రం, ఏరువాక కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. నూతనంగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో కేవీకే, ఏరువాక కేంద్రం అందుబాటులో లేదన్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పరిధిలోనున్న ఏరువాక కేంద్రాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీ చేశారన్నారు. ఏరువాక కేంద్రం పరిధిలో ఒక కో-ఆర్డినేటర్‌, ఇద్దరు శాస్త్రవేత్తలు ఉంటారన్నారు. శాస్త్రవేత్తలు జిల్లాలోని ప్రతి మండలాన్ని సందర్శించి రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు అందజేస్తారన్నారు. ఈ ఏరువాక కేంద్రం చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిధిలో నడుస్తుందన్నారు. జిల్లా రైతులకు ఏరువాక కేంద్రం అందుబాటులోకి రావడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు జిల్లా అధికారులు, వ్యవసాయ, ఉద్యానశాఖతో సమన్వయం చేసుకుంటూ కాలానికి అనుగుణంగా వ్యవసాయ సలహాలు అందిస్తారన్నారు. రైతులు సాగులో ఎదురయ్యే సమస్యలకు తక్షణ పరిష్కారం తెలియజేస్తారని, ఈ కేంద్రాన్ని పాడేరు సెరీకల్చర్‌ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు.

Updated Date - 2023-04-03T00:54:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising