పిడుగుపాటుకు గిరిజనుడి మృతి
ABN, First Publish Date - 2023-06-05T01:12:10+05:30
మండలంలోని సుకూరు పంచాయతీ చట్రాయిపుట్టు గ్రామంలోని పొలాల్లో పిడుగుపడడంతో పశువులు కాయడానికి వెళ్లిన ఒక వృద్ధుడు మృతిచెందాడు. ఇదే మండలం గడికించుమండలో కూడా పశువులను మేతపడానికి వెళ్లిన ఇద్దరు గిరిజనులు పిడుగుపాటుతో తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం పాడేరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
సుకూరు పంచాయతీ చట్రాయిపుట్టులో ఘటన
గడికించుమండలో పిడుగు పడి ఇద్దరికి తీవ్రఅస్వస్థత
పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలింపు
హుకుంపేట జూన్ 4: మండలంలోని సుకూరు పంచాయతీ చట్రాయిపుట్టు గ్రామంలోని పొలాల్లో పిడుగుపడడంతో పశువులు కాయడానికి వెళ్లిన ఒక వృద్ధుడు మృతిచెందాడు. ఇదే మండలం గడికించుమండలో కూడా పశువులను మేతపడానికి వెళ్లిన ఇద్దరు గిరిజనులు పిడుగుపాటుతో తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం పాడేరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
మండలంలోని సుకూరు పంచాయతీ చట్రాయిపుట్టు గ్రామానికి చెందిన డోమంగి మఽధు (67) ఆదివారం ఉదయం సమీపంలోని పొలాల్లోకి పశువులను మేతకు తోలుకెళ్లాడు. మధ్యాహ్నం తరువాత ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం మొదలైంది. దీంతో పశువులను తోలుకుంటూ ఇంటిదారిపట్టాడు. దారిలో పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కొద్దిసేపటి తరువాత అటుగా వస్తున్న వ్యక్తులు చూసి, మధు మృతిచెందిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. గ్రామస్థులు వచ్చి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు.
ఇదిలావుండగా పంచాయతీ కేంద్రమైన గడికించుమండ గ్రామానికి చెందిన పాంగి కొండబాబు, కాటే భూషణరావు ఆదివారం ఉదయం పశువులను మేతకు తీసుకెళ్లారు. మధ్యాహ్నం వర్షం పడడంతో చెట్టుకిందకు వెళ్లి నిల్చున్నారు. కొద్దిసేపటి తరువాత అతి సమీపంలో పిడుగు పడడంతో తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి సమీపంలో ఈ సంఘటన జరగడంతో స్థానికులు చూసి వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌లో పాడేరు జిల్లా అస్పత్రికి తరలించారు.
Updated Date - 2023-06-05T01:12:10+05:30 IST