ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చింతాలమ్మ ఘాట్‌లో కూలిన భారీ వృక్షం

ABN, First Publish Date - 2023-06-26T01:13:39+05:30

చింతాలమ్మ ఘాట్‌ రోడ్డులో ఆదివారం ఉదయం భారీ చింతచెట్టు నేలకూలింది. దీంతో సుమారు నాలుగు గంటల సేపు రాకపోకలు నిలిచి పోయాయి. దీంతో వాహనచోదకులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. శనివారం భారీ వర్షం కురవడంతో చింతాలమ్మ ఘాట్‌ రోడ్డు మూడవ మలుపు సమీపంలో రహదారికి ఆనుకుని ఉన్న భారీ చింతచెట్టు ఆదివారం ఉదయం 6.30 గంటలకు నేలకూలింది.

చింతాలమ్మఘాట్‌లో కలిన భారీ వృక్షాన్ని తొలగించే చర్యలు చేపడుతున్న కొయ్యూరు పోలీసు సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నాలుగు గంటల పాటు నిలిచిపోయిన వాహనాల రాకపోకలు

- వాహనచోదకులు, ప్రయాణికుల ఇబ్బందులు

- చెట్టు తొలగించి రాకపోకలు పునరుద్ధరించిన పోలీసులు

కొయ్యూరు, జూన్‌ 25: చింతాలమ్మ ఘాట్‌ రోడ్డులో ఆదివారం ఉదయం భారీ చింతచెట్టు నేలకూలింది. దీంతో సుమారు నాలుగు గంటల సేపు రాకపోకలు నిలిచి పోయాయి. దీంతో వాహనచోదకులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. శనివారం భారీ వర్షం కురవడంతో చింతాలమ్మ ఘాట్‌ రోడ్డు మూడవ మలుపు సమీపంలో రహదారికి ఆనుకుని ఉన్న భారీ చింతచెట్టు ఆదివారం ఉదయం 6.30 గంటలకు నేలకూలింది. దీంతో నర్సీపట్నం నుంచి కొయ్యూరు, ఏలేశ్వరం తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తె లుసుకున్న కొయ్యూరు ఎస్‌ఐ రాజారావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులు, సిబ్బంది సహకారంతో చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు. సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి చెట్టును తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు. జాతీయ రహదారి నిర్మాణ పనులకు వినియోగించే యంత్రాలను సంబంధిత కాంట్రాక్టరు సరఫరా చేయడంతో చెట్టు తొలగింపు త్వరితగతిన పూర్తయి రాకపోకలకు ఇబ్బందులు తొలిగాయి.

Updated Date - 2023-06-26T01:13:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising