ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైద్యుల మస్కా

ABN, First Publish Date - 2023-08-02T01:15:49+05:30

బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించేలా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌)ను తీసుకువచ్చినా ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు.

బోధనాస్పత్రుల్లో పలువురు సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదనే ఆరోపణలు

ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌)ను తీసుకువచ్చినా నెరవేరని ప్రయోజనం

అటెండెన్స్‌ వేసుకుని బయటకు వెళ్లిపోతున్న వైనం

కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించేలా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌)ను తీసుకువచ్చినా ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌, వైద్య విధాన పరిషత్‌లలో దీని అమలు మెరుగ్గానే ఉన్నప్పటికీ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ (డీఎంఈ) పరిధిలోని బోధనాస్పత్రుల్లో పూర్తిస్థాయిలో కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కొంతమంది వైద్యులు, సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ ఉన్నప్పటి కంటే పరిస్థితి దారుణంగా వుందనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఎఫ్‌ఆర్‌ఎస్‌ సరిగా అమలు కావడం లేదు.

వైద్యులు, సిబ్బంది విధులకు హాజరైనప్పుడు ఒకసారి, మధ్యాహ్నం మరొకసారి, డ్యూటీ దిగే సమయంలో ఇంకొక సారి ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) నిమిత్తం రూపొందించిన యాప్‌లో హాజరు వేసుకోవాల్సి ఉంటుంది. కానీ, కొందరు వైద్యులు, సిబ్బంది అతి తెలివి ప్రదర్శిస్తూ ఎఫ్‌ఆర్‌ఎస్‌కే బురిడీ కొట్టిస్తున్నారు.

హాజరు వేసుకోవడం ఇలా..

ఎఫ్‌ఆర్‌ఎస్‌లో హాజరు వేసుకోవాలంటే ముందుగా ఆస్పత్రిలో పనిచేసే ఉద్యోగులు యాప్‌లో రిజిస్టర్‌ చేసు కోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆయా ఆస్పత్రుల ప్రాంగ ణాల్లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ సెంటర్స్‌ ఏర్పాటుచేశారు. అక్కడ రిజి స్ర్టేషన్‌ చేయించుకున్న వాళ్లు సదరు ఆస్పత్రి ప్రాంగణంలో ఉండి ప్రతిరోజూ మూడుసార్లు యాప్‌ ఓపెన్‌ చేసి హాజరు వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్ర్టేషన్‌ చేయించుకున్న ఆస్పత్రి పరిసరాలకు దూరంగా ఉండి హాజరు వేసుకునే యత్నం చేస్తే మాత్రం ఫేస్‌ను యాప్‌ రికగ్నైజ్‌ చేయదు. ఆస్పత్రి పరిసరాల్లో ఉంటేనే యాప్‌ ఓపెన్‌ చేసిన వెంటనే ఫేస్‌ రికగ్నైజ్‌ చేసి గ్రీన్‌కలర్‌ మార్క్‌ వస్తుంది. గ్రీన్‌ కలర్‌ వస్తేనే హాజరు పడినట్టు. అదే సదరు వైద్యుడు, వైద్య సిబ్బంది ఆస్పత్రి ప్రాంగణంలో లేననట్టయితే రెడ్‌ కలర్‌ మార్కింగ్‌ వస్తుంది. అయితే, ఇది అమలులోకి తెచ్చిన మొదట్లో వైద్యులు, సిబ్బంది సకాలంలో విధులకు హాజరయ్యే వారు. ఆ తరువాత చాలామంది వైద్యులు ఉదయం హాస్పిటల్‌కు వచ్చి హాజరు వేసుకుని బయటకు వెళ్లిపోవడం మొదలెట్టారు. మళ్లీ మధ్యాహ్నం రావడం హాజరు వేసుకుని వెళ్లిపోవడం, సాయంత్రం వెళ్లిపోయే సమయానికి వచ్చి మరోసారి అటెండెన్స్‌ వేసుకోవడం చేస్తున్నారు. కేజీహెచ్‌, విమ్స్‌ తదితర ఆస్పత్రుల్లో పలువురు వైద్యులు ప్రైవేటు/ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పనిచేస్తుంటారు. వీరంతా ఉదయం ఆస్పత్రికి వచ్చి అటెండెన్స్‌ వేసుకుని మళ్లీ అక్కడకు వెళ్లి సేవలు అందిస్తున్నారు. మిగిలిన రెండుసార్లు కూడా హాజరు కోసం ఆస్పత్రి ప్రాంగణంలోకి రావడం, తిరిగి వెళ్లి పోవడం..ఇదే తంతుగా మారుతోంది. వైద్యులు ప్రైవేటు సేవకు చెక్‌ చెప్పే ఉద్దేశంతో దీన్ని తెచ్చినప్పటికీ ఉన్నతాధి కారుల పర్యవేక్షణలోపం కారణంగా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వడం లేదు. బయోమెట్రిక్‌ హాజరు ఉన్నప్పటికీ కంటే ఇప్పుడే వైద్యులు ప్రైవేటు సేవలో తరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సిబ్బంది కూడా ఇదేవిధంగా హాజరు వేయించుకుంటూ బయట తమ పనులను చక్క బెట్టుకుంటున్నారు. ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో పర్య వేక్షించకపోవడంతో సమస్య ఉత్నన్నమవు తోంది.

Updated Date - 2023-08-02T01:15:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising