విజ్ఞాన్ వర్సిటీ వీశాట్ ఫేజ్-1 ఫలితాలు విడుదల
ABN, First Publish Date - 2023-05-02T02:54:41+05:30
బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చరల్ తదితర కోర్సుల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా విజ్ఞాన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన వీ శాట్ (విజ్ఞాన్ స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్) 2023 ఫేజ్-1 ఫలితాలను
3 నుంచి కౌన్సెలింగ్: వీసీ ఆచార్య పి.నాగభూషణ్
గుంటూరు(విద్య), మే 1: బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చరల్ తదితర కోర్సుల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా విజ్ఞాన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన వీ శాట్ (విజ్ఞాన్ స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్) 2023 ఫేజ్-1 ఫలితాలను ఉపకులపతి ఆచార్య పి.నాగభూషణ్ సోమవారం విడుదల చేశారు. గుంటూరు సమీపంలోని వడ్లమూడిలోని విజ్ఞాన్ వర్సిటీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఏిపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానం ద్వారా నిర్వహించిన పరీక్షకు అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు. వీశాట్ ర్యాంకులతోపాటు జేఈఈ మెయిన్స్ ఫలితాలు, ఎంసెట్ ర్యాంకులు, ఇంటర్ మార్కుల్ని పరిగణనలోని తీసుకుని ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు. ఈ నెల 3వ తేదీ నుంచి విజ్ఞాన్ వర్సిటీలో బీటెక్, బీ ఫార్మశీ, బీఎస్సీ అగ్రికల్చరల్ సైన్స్ కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విశాట్ ఫలితాలు జ్ట్టిఞట://ఠీఠీ ఠీ.ఠిజీజుఽ్చుఽ.్చఛి.జీుఽ/ఠిట్చ్టట్ఛటఠజ్టూ అనే వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపారు. విద్యార్థుల సెల్‌ఫోన్‌లకు ఎస్‌ఎంఎస్ రూపంలో ఫలితాలు పంపుతున్నామని వీసీ వెల్లడించారు.
Updated Date - 2023-05-02T02:54:41+05:30 IST