CM JAGAN : నేడు వెంకటగిరికి సీఎం
ABN, First Publish Date - 2023-07-21T03:15:46+05:30
సీఎం జగన్ శుక్రవారం తిరుపతి జిల్లా వెంకటగిరికి రానున్నారు. నేతన్న నేస్తం పథకం కింద లబ్ధిదారుల ఖాతాలకు నగదు జమ చేసేందుకు బటన్ నొక్కనున్నారు.
నేతన్న నేస్తం పథకానికి బటన్ నొక్కనున్న జగన్
తిరుపతి, జూలై 20(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్ శుక్రవారం తిరుపతి జిల్లా వెంకటగిరికి రానున్నారు. నేతన్న నేస్తం పథకం కింద లబ్ధిదారుల ఖాతాలకు నగదు జమ చేసేందుకు బటన్ నొక్కనున్నారు. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించనున్నారు. శుక్రవారం ఉదయం విజయవాడ నుంచి విమానంలో రేణిగుంట చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వెంకటగిరికి వెళ్లనున్నారు. అక్కడ బహిరంగసభలో బటన్ నొక్కి నేతన్న నేస్తం ఆర్థిక సాయాన్ని లబ్దిదారుల ఖాతాలకు జమ చేయనున్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు
Updated Date - 2023-07-21T03:18:16+05:30 IST