ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

LV Subramaniam : ఇది చాలా తప్పు

ABN, First Publish Date - 2023-09-15T04:02:23+05:30

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌ ఎల్‌.వి సుబ్రమణ్యం స్పందించారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’తో పాటు పలు మీడియా చానళ్లతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబును అరెస్టు చేసి న విధానం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఒకసారి క్యాబినెట్‌ రిజల్యూషన్‌ అయ్యాక..

చంద్రబాబును అరెస్టు చేసిన విధానం రాజ్యాంగ విరుద్ధం

మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం వ్యాఖ్యలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌ ఎల్‌.వి సుబ్రమణ్యం స్పందించారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’తో పాటు పలు మీడియా చానళ్లతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబును అరెస్టు చేసి న విధానం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఒకసారి క్యాబినెట్‌ రిజల్యూషన్‌ అయ్యాక.. ప్రతిపాదన చేసిన మంత్రో, ముఖ్యమంత్రో, కార్యదర్శో దానికి బాధ్యత తీసుకోవాలంటూ నిందను వారి నెత్తిన కుమ్మరించడానికి ప్రయత్నించడం రాజ్యాంగ విరుద్ధం అవుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న తంతు చూస్తుంటే.. వ్యవస్థలో సీఎం, మంత్రుల అవసరం లేదని, పోలీసులే ఉండాలన్న పరిస్థితులు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ‘‘వీరు (దర్యాప్తు అధికారులు) అన్వేషణ చేయాల్సింది కేవలం అమలు స్థాయిలోనే. దానికంటే ముందుకు వెళ్లి చేయాలంటే అది న్యాయస్థానాల పని. అదికూడా రాజ్యాంగ విరుద్ధంగా గనక ఆ పాలసీ ఉంటే.. అది వాళ్లు (కోర్టులు) చూడాలి. రాజ్యాంగం ప్రకారం ఎవరు చేయాల్సిన పని వాళ్లు చేయాలి. అన్నీ నేనే చూసేస్తానని ఎవరూ అనుకోవడానికి లేదు. కోర్టులే పలు సందర్భాల్లో.. ‘‘ఇది మా పరిధిలో లేదు. మేం ఇది చేయడానికి లేదు. మీరు కార్యనిర్వాహక వ్యవస్థ వద్దకు వెళ్లండి’’ అంటూ పలు పిటిషన్లను తిరస్కరిస్తుంటాయి’’ అని గుర్తుచేశారు. ఒక కార్యక్రమంలో అన్యాయం, అక్రమం జరిగినట్టు.. ధనాన్ని దురుపయోగం చేసినట్టు అభియోగం వస్తే.. అమలు జరిగే క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తీసుకుని, చర్యలు తీసుకోవాలిగానీ.. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ ముఖ్యమంత్రి స్థాయి దాకా వెళ్లి ఆయన్ను తప్పు పడతానని చెప్పడం ఏమిటో తనకు అర్థం కావట్లేదన్నారు. ‘‘ఎవరు వీళ్లకు అనుమతులు ఇస్తున్నారో నాకు తెలియట్లేదు. అది చాలా చాలా తప్పు’’ అని ఎల్వీ సుబ్రమణ్యం ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇవాళ రాజ్యాంగాన్ని నడిపించాల్సింది క్యాబినెట్‌. అలాంటి క్యాబినెట్‌నే తప్పు పట్టే దర్యాప్తు సంస్థను బహుశా ఇంతవరకూ రాజ్యాంగం ఎక్కడా తయారుచేయలేదు. అమలు చేసే అధికారి క్యాబినెట్‌ ఆమోదించిన ప్రతిపాదనకు విరుద్ధంగా అమలుచేస్తే.. ఆయన వరకే తప్పుంటుంది. అంతే తప్ప దాని పూర్వాపరాలు వెతుక్కుంటూ.. రంధ్రాన్వేషణ చేస్తూ.. కార్యదర్శి, మంత్రి, ముఖ్యమంత్రి దాకా వెళ్లిపోతామంటే వీలు కాదు. దర్యాప్తు సంస్థకు ఈ విషయం బోధపడకపోతే.. వారిని కూర్చోబెట్టి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం మంచిది.’’ అన్నారు. ‘‘ముఖ్యమంత్రి ఒక అధికారినో, ఒక శాఖనో.. ‘నాకు ఇలా డబ్బులు కావాలి’ అని అడిగే పరిస్థితి నేనెప్పుడూ వినలేదు. ’’ అని ఎల్వీ పేర్కొన్నారు.

ప్రైవేటు బిజినెస్‌ కాదు..

ఏ ముఖ్యమంత్రీ ఒక అధికారిని పిలిచి.. సాయంత్రంకల్లా డబ్బులు తీసుకొచ్చి తనకు ఇచ్చేయాలని చెప్పరని, అలా చెప్పడానికి ప్రభుత్వమనేది ప్రైవేటు బిజినెస్‌ కాదని.. ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందని ఎల్వీ సుబ్రమణ్యం వివరించారు. శాసనసభ ఏదైనా పద్దుకు ఆమోదం తెలిపి.. ఆ పద్దు కింద ఇంత డబ్బును ఇచ్చినట్టు చెప్పిన తరువాత, ఆ మొత్తాన్ని ఆర్థిక శాఖ కేటాయించినవారికి ఇవ్వాలని.. ఆ విషయాన్ని సీఎం చెప్పారా, చెప్పలేదా అనేది అప్రస్తుతమని, బడ్జెట్‌లో కేటాయింపు ఉందా లేదా అన్నదే ముఖ్యమని అన్నారు. వాళ్లు చెప్పిందాన్నే తప్పుగా భావిస్తే ఇక సీఎం, మంత్రులను తీసివేయాల్సిందేనని.. ఎవరు ఉండకూడదని.. కేవలం పోలీసు అధికారులు మాత్రమే ఉండాలనేటట్టు ఈ వ్యవస్థ ఉందని ఎల్వీ ఆవేదన వెలిబుచ్చారు.

గతంలో రాష్ట్ర ప్రభుత్వ సాయంతో జాతీయ క్రీడల కోసం 15-16 నెలల్లో గచ్చిబౌలిలో అద్భుతమైన క్రీడాప్రాంగణాలను తయారుచేశాం. కానీ ఎప్పుడూ నాకు ఒక్కసారి కూడా ‘ఇదుగో ఫలానా టెండర్‌లో వీళ్లకు సాయం చేయండి లేదా వీళ్ల సహాయంతో నాకు సహాయం లభిస్తుంది’ అని చంద్రబాబు నన్ను అడగలేదు. నాకున్న అనుభవంలో ఎప్పుడూ ఆయనతో అలాంటి సంభాషణ అసలు జరగలేదు. ప్రతి స్థాయిలో ఉన్నవారినీ అనుమానించడం.. ప్రతివారి మీదా బురదజల్లే ప్రయత్నం జరగడం ప్రజాస్వామ్యానికి అంత హేతుబద్ధం కాదు

- ఎల్వీ సుబ్రమణ్యం

Updated Date - 2023-09-15T04:02:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising