కానిస్టేబుల్‌ను కాటేసిన కట్లపాము
ABN, First Publish Date - 2023-05-24T04:51:11+05:30
రాజధాని విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను కట్లపాము కాటేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను సహచర పోలీసులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తీవ్ర అస్వస్థత.. పరిస్థితి విషమం
‘ఆర్-5 జోన్’లో ఘటన.. సరైన వసతి లేకే..
తాళ్లూరు, తుళ్లూరు(తాడికొండ), మే 23: రాజధాని విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను కట్లపాము కాటేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను సహచర పోలీసులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాలివీ.. రాజధాని అమరావతిలోని ఆర్-5జోన్‌లో పేదలకు సెంటు భూమి పంపిణీకి సంబంధించి ప్రభుత్వం లేఅవుట్ పనులను చేపట్టింది. ఇక్కడి అనంతవరం లేఅవుట్‌ల వద్ద ప్రకాశం జిల్లా తాళ్లూరు పోలీ్‌సస్టేషన్ నుంచి కానిస్టేబుల్ పవన్‌కుమార్ బందోబస్తు విధుల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో తుళ్లూరు మండలం అనంతవరం వెంకటేశ్వరస్వామి గుడి ఆవరణలో సోమవారం అర్ధరాత్రి పవన్ నిద్రిస్తుండగా ఒక్కసారిగా పాము కాటు వేయటంతో ఉలికిపడిలేచాడు.
పామును చేత్తో లాగేసే ప్రయత్నంలో చేతిపై కూడా కాటు వేసింది. తోటి సిబ్బంది పామును చంపి పవన్‌ను వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆ తర్వాత పవన్‌కు కార్డియాక్ అరెస్ట్ అవ్వటంతో గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉందని పోలీసులు చెప్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆసుపత్రికి వెళ్లి కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. ఆర్-5జోన్ బందోబస్తుకు వెళ్లిన సిబ్బందికి ప్రభుత్వం సరైన వసతి ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Updated Date - 2023-05-24T05:46:15+05:30 IST