ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘాట్‌ రోడ్డులో గుండె దడదడ..!

ABN, First Publish Date - 2023-01-30T04:04:45+05:30

శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో పెనుప్రమాదం తప్పింది. 30 మందితో వెళ్తున్న టీఎ్‌సఆర్టీసీ రక్షణ గోడను ఢీకొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీశైలంలో రక్షణ గోడను ఢీకొన్న టీఎ్‌సఆర్టీసీ బస్సు

ఇనుప బ్యారికేడ్‌ ఉండడంతో తప్పిన ముప్పు

శ్రీశైలం, జనవరి 29: శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో పెనుప్రమాదం తప్పింది. 30 మందితో వెళ్తున్న టీఎ్‌సఆర్టీసీ రక్షణ గోడను ఢీకొట్టింది. గోడ ధ్వంసమైనప్పటికీ దానికి ముందు ఇనుప బ్యారికేడ్‌ ఉండడంతో లోయలోకి పడిపోకుండా ఆగింది. దీంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. శ్రీశైలం జలాశయం వద్ద ఆదివారం ఈ సంఘటన జరిగింది. శ్రీశైలం నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్తున్న టీఎస్‌ ఆర్టీసీ బస్సు జలాశయం వద్దకు రాగానే మలుపు వద్ద అదుపు తప్పింది. డ్రైవర్‌ బస్సు వేగాన్ని నియంత్రించలేకపోవడంతో రక్షణ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో గోడ ధ్వంసం కావడంతో బస్సు ముందు చక్రం ఒకటి గాలిలో వేలాడింది. అయితే ఇనుప బారికేడ్‌ అడ్డు ఉండడం వల్ల బస్సు లోయలో పడకుండా ఆగిపోయింది. బస్సులో ఉన్న 30 మంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్సు ఆగిన వెంటనే భయంతో కిందకు దిగేశారు. ఎదురుగా ఉన్న 150 అడుగుల లోయను చూసి పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ప్రమాదానికి కారణాలను పరిశీలించేందుకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కంట్రోలర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Updated Date - 2023-01-30T04:11:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising