ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మంత్రిపై వైసీపీ సర్పంచ్‌ ధ్వజం

ABN, First Publish Date - 2023-06-26T23:38:33+05:30

చినవంక గ్రామంలో సోమవారం నిర్వహించిన ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి తనకు సమాచారం ఇవ్వకుండా మంత్రి విస్మరించడంపై వైసీపీ సర్పంచ్‌ దువ్వాడ విజయ లక్ష్మి ధ్వజ మెత్తారు. ఈ మేరకు సోమవారం విలేకరులతో మాట్లాడు తూ.. సర్పంచ్‌కు తెలుపకుండా ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వ హించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. అధి కార పార్టీకి చెందిన సర్పంచ్‌ని అయినప్పటికీ మంత్రి అప్పల రాజు తనకు తెలియజేయకుండా గ్రామంలో సమావేశం నిర్వహించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. దీనిపై గవర్నర్‌కు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తనకు తెలియకుండా సమావేశం నిర్వహించడమేమిటని మండిపాటు

తమ గ్రామాలపై వివక్ష చూపుతున్నారని ఆగ్రహం

వజ్రపుకొత్తూరు, జూన్‌ 26: చినవంక గ్రామంలో సోమవారం నిర్వహించిన ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి తనకు సమాచారం ఇవ్వకుండా మంత్రి విస్మరించడంపై వైసీపీ సర్పంచ్‌ దువ్వాడ విజయ లక్ష్మి ధ్వజ మెత్తారు. ఈ మేరకు సోమవారం విలేకరులతో మాట్లాడు తూ.. సర్పంచ్‌కు తెలుపకుండా ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వ హించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. అధి కార పార్టీకి చెందిన సర్పంచ్‌ని అయినప్పటికీ మంత్రి అప్పల రాజు తనకు తెలియజేయకుండా గ్రామంలో సమావేశం నిర్వహించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. దీనిపై గవర్నర్‌కు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తమ పంచా యతీ పరిధిలో మూడు గ్రామాలపై మంత్రి వివక్ష చూపుతు న్నారన్నారు. ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క అభివృద్ధి పని చేపట్ట లేదని విమర్శించారు. 2020లో రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే హోదాలో శంకుస్థాపన చేసినా ఇంతవరకు పూర్తి చేయక పోవడం మంత్రి పనితీరుకు నిదర్శనమన్నారు. వంశధార నీటిని ఈ ప్రాంతానికి తీసుకురాకపోవడంతో రైతులు తీవ్రం గా నష్టపోయారన్నారు. రైతులపై మంత్రికి సరైన అభి ప్రా యం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని వాపోయారు. తన సొంత సొమ్ము రూ.2 లక్షలతో గండిని పూడ్చామని, రైతు ల శ్రమదానంతో లహరిబంద చెరువు మదుములు నిర్మిం చినట్లు చెప్పారు. చినవంక పంచాయతీకి మంత్రి ఒక్క రూపా యి కూడా కేటాయించలేదని విమర్శించారు. కనీసం పవర్‌ బోరు కూడా గుల్లలపాడు గ్రామానికి ఇవ్వలేదని పేర్కొన్నారు.

‘జగనన్న సురక్ష’ను వినియోగించుకోండి

జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. సోమవారం చినవంకలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. నెలరోజుల పాటు గ్రామాల్లో అధికారుల బృందాలు పర్యటిస్తా యని, ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు అందిస్తారన్నారు. ఉద్దాన ప్రాంతం లోని జీడి పిక్కల సమస్యపై చర్చలు జరుగుతున్నాయని, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం త్వరలో లభిస్తుందన్నారు. సమావేశంలో తహసీల్దార్‌ బి.అప్పలస్వామి, ఎంపీడీవో ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:38:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising