ఓటర్లను ప్రలోభపెడుతున్న వైసీపీ
ABN, First Publish Date - 2023-03-05T00:02:02+05:30
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పట్టభద్రుల ఓటర్లను వైసీపీ ప్రలోభ పెడుతోందని మాజీ మంత్రి పితాని సత్య నారాయణ విమర్శించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. శనివారం పలాస, నరసన్నపేట పార్టీ కార్యాలయాల్లో పార్టీ నేతలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రుల ఓటర్లను నేరుగా కలిసి టీడీపీ అభ్యర్థి డా.వేపాడ చిరంజీవిరావుకు మొదటి ప్రాధాన్యతా ఓటు వేసేలా అవగాహన కలిగించాలన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి
చిరంజీవిరావును గెలిపించండి
మాజీ మంత్రి పితాని సత్యనారాయణ
పలాస/నరసన్నపేట: ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పట్టభద్రుల ఓటర్లను వైసీపీ ప్రలోభ పెడుతోందని మాజీ మంత్రి పితాని సత్య నారాయణ విమర్శించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. శనివారం పలాస, నరసన్నపేట పార్టీ కార్యాలయాల్లో పార్టీ నేతలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రుల ఓటర్లను నేరుగా కలిసి టీడీపీ అభ్యర్థి డా.వేపాడ చిరంజీవిరావుకు మొదటి ప్రాధాన్యతా ఓటు వేసేలా అవగాహన కలిగించాలన్నారు. స్వా తంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్నను దుర్భాషలాడడం తగదన్నారు. వైసీపీ నేతలు ఫోన్‌పే, పేటీఎం అకౌంట్లతో ఓటర్లను ప్రలో భ పెడుతున్నారని విమర్శించారు. బ్రిటీస్ రాజ్యాన్ని మించి సీఎం జగన్ పాలన చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో చంద్ర బాబునాయుడును మళ్లీ సీఎంగా చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గౌతు శ్యామ సుందర శివాజీ, మాజీ ఎమ్మె ల్యే బగ్గు రమణ మూర్తి, పార్టీ పరిశీలకుడు బండారు సత్యానందరావు, రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరరావు యాదవ్, పీరుకట్ల విఠల్‌రావు, గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ పాల్గొ న్నారు. వజ్రపు కొత్తూరు మండలం బెండి, పలాస మండలం బ్రాహ్మణ తర్లాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా శిరీష ప్రచారం చేశారు. సూరాడ మోహనరావు, కణితి సురేష్, లక్ష్మణకుమార్ పాల్గొన్నారు.
Updated Date - 2023-03-05T00:02:02+05:30 IST