అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి
ABN, First Publish Date - 2023-07-21T00:12:04+05:30
పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల పరిధిలోని ఓ వివాహిత గురువారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది.
పలాస: పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల పరిధిలోని ఓ వివాహిత గురువారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు... సూదికొండ కాలనీకి చెందిన వివాహిత పైల సావిత్రి(35) ఇంటి వద్ద ఉరిపోసుకొని మృతి చెంది ఉండడాన్ని గుర్తించి భర్త జానకిరావుతో పాటు కాలనీ వాసులు పలాస ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ఆమె మృతిపై భిన్నాభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా పూర్తి స్థాయిలో కేసు నమోదు చేస్తామని కాశీబుగ్గ సీఐ జి.శ్రీనివాసరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కాగా సావిత్రికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
Updated Date - 2023-07-21T00:12:04+05:30 IST