ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

లారీ ఢీకొని మహిళ దుర్మరణం

ABN, First Publish Date - 2023-06-26T23:34:19+05:30

కవిటి మండలం ఆర్‌ఎస్‌ సమీపంలో జాతీయ రహదారి పై ఆదివారం రాత్రి లారీ ఢీకొన్న ఘటనలో బి.జయంతి(35) మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కవిటి(కంచిలి): కవిటి మండలం ఆర్‌ఎస్‌ సమీపంలో జాతీయ రహదారి పై ఆదివారం రాత్రి లారీ ఢీకొన్న ఘటనలో బి.జయంతి(35) మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇచ్ఛాపురం మండలం కేశుపురం గ్రామానికి చెందిన బి.గిరిబాబు, జయంతి దంపతులు తమ కుమారుడిని మందస వద్ద గల పాఠశాలలో చేర్పించి తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. వర్షం కురుస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వీర్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో జయంతి అక్కడికక్కడే మృతి చెందింది. గిరిబాబుకు స్వల్ప గాయాలయ్యాయి. గిరిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ కూర్మారావు తెలిపారు.

రైలు ఢీకొని యువకుడు..

ఇచ్ఛాపురం: రైలు ఢీకొని ఓ మతిస్థిమ్మితం లేని యువకుడు మృతిచెందాడు. పలాస రైల్వే ఎస్‌ఐ ఎస్‌కే షరీఫ్‌ తెలిపిన వివరాల మేరకు.. ఇచ్ఛాపురం మండలం కేదారిపురం గ్రామానికి చెందిన నీలాపు లోకేష్‌(24) మతిస్థిమిత్తం లేకపోవడంతో 2015 నుంచి విశాఖలో మానసిక వైద్యశాలలో చికిత్సపొందుతున్నాడు. ఇటీవలే ఇంటికి తీసుకొచ్చారు. ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి తిరిగిరా లేదు. సోమవారం ఉదయం ఇచ్ఛాపురం నుంచి కేదారిపురంలోని ఇంటికి వెళ్లేందుకు రైలు ట్రాక్‌ దాటి వస్తున్నాడు. ఆ సమయంలో పురుషోత్తపురం రైల్వేగేట్‌ సమీపంలో గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. కేసు నమోదు చేసి మృతదేహా న్ని పోస్ట్‌మార్టం కోసం పలాస ప్రభుతాసుపత్రికి తరలించినట్టు తెలిపారు.

దుబాయ్‌లో సీమెన్‌ మృతి

సంతబొమ్మాళి: జగన్నాఽథపురం గ్రామానికి చెందిన సీమెన్‌ ఎ.అప్పారావు(38) విధుల్లో ఉంటూ అనారోగ్యానికి గురై దుబాయ్‌లో మృతి చెందాడు. ఈ మేరకు సోమవారం షిప్‌ యాజమాన్యం నుంచి సమాచారం అందిందని కుటుంబ సభ్యు లు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అప్పారావుకి భార్య గాయిత్రి ఇద్దరు కుమార్తె లు, ఒక్క కుమారుడు ఉన్నాడు. అప్పారావు మృతితో గ్రామం లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2023-06-26T23:34:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising