చంద్రబాబుతోనే రాష్ట్రానికి ప్రపంచస్థాయి గుర్తింపు
ABN, First Publish Date - 2023-09-22T23:47:56+05:30
రాష్ట్రానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు గుండ అప్పలసూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే, శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి గుండ లక్ష్మీదేవి అన్నారు.
- మాజీ మంత్రి గుండ దంపతులు
- జిల్లాలో కొనసాగుతున్న దీక్షలు
అరసవల్లి, సెప్టెంబరు 22: రాష్ట్రానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు గుండ అప్పలసూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే, శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి గుండ లక్ష్మీదేవి అన్నారు. శుక్రవారం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కొర్ను నాగార్జున ప్రతాప్ ఆధ్వర్యంలో యువత చేపట్టిన నిరాహార దీక్షలో వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రానికి చెందిన వేలాదిమంది యువత ప్రపంచ వ్యాప్తంగా ఉన్నతోద్యోగాల్లో ఉన్నారంటే అది చంద్రబాబు ముందు చూపు వల్లేనన్నారు. అటువంటి నాయకుడికి అవినీతి మరకలు అంటించాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. 16 నెలలు జైలులో గడిపిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అవినీతిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సం క్షోభాలు టీడీపీకి కొత్తేమీదని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మరింత శక్తితో ముందుకే వెళతామన్నారు. కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, మెండ దాసునాయుడు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, టీడీపీ అధికార ప్రతినిధి ముద్దాడ కృష్ణమూర్తి, రాష్ట్ర తెలుకల సాధికార సమితి సభ్యుడు కొమ్మనాపల్లి వెంకటరామరాజు, జంగమ సేవా సంఘం జిల్లా అధ్యక్షు డు విభూది సూరిబాబు, జనసేన, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
- ఇచ్ఛాపురం: రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని ఇం టికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నాయకులు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఇచ్ఛాపురం పాత బస్టాండ్ వద్ద చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శుక్రవారం నాటికి పదో రోజుకి చేరింది. కవిటి మండల టీడీపీ అధ్యక్షుడు మణిచంద్రప్రకాష్ ఆధ్వర్యంలో నాయకులు వాసుయాదవ్, పుల్లట రాజు, బి.విజయ్‌కృష్ణ, టి.ధర్మ, బి.వీరాస్వా మి, బి.శ్రీనివాస్, బి.రామానందం, పి.ప్రవీణ్, బి.రమేష్, అశోక్‌కుమార్ దీక్షలో కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బుబుతో నేను పోస్ట్ కార్డులు చంద్రబాబుకు మద్దతుగా పంపించారు. వీరికి బీసీ సాధికార సమితి కన్వీనర్ కొండా శంకర్‌రెడ్డి, పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆశి లీలారాణి, తెలుగు యువత అధ్యక్షులు కాళ్ల జయదేవ్, కౌన్సిలర్లు పత్రి తవిటయ్య, సీపాన వెంకటరమణ, బి.కృష్ణయ్య సంఘీభావం తెలిపారు.
- ఎచ్చెర్ల: ప్రభుత్వ తీరును, అధికార పార్టీ నేతల అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్టులకు పాల్పడుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్య దర్శి కిమిడి రామ్‌మల్లిక్ నాయుడు ఆరోపించారు. ఎచ్చెర్లలోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయం ఆవరణలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కొనసాగుతు న్న దీక్షలో భాగంగా శుక్రవారం పార్టీ రైతు అనుబంధ సంఘాల ప్రతినిధులతో పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎడ్ల బండిపై ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో టీడీపీ 160 సీట్లతో విజయం సాధించి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారన్నా రు. కార్యక్రమంలో పార్టీ నేతలు బెండు మల్లే శ్వరరావు, వావిలపల్లి రామకృష్ణ, పంచిరెడ్డి సత్య నారాయణ, గొర్లె లక్ష్మణరావు, రాజాపంతుల ప్రకాశరావు, మెండ రాజారావు, అన్నెపు భువ నేశ్వరరావు, గాలి వెంకటరెడ్డి, పంచిరెడ్డి కృషా ్ణరావు, పైడి ముఖలింగం, పైడి అన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.
- కాశీబుగ్గ: టీడీపీ అధినేత చంద్రబాబును విడిచిపెట్టే వరకూ పోస్టుకా ర్డు ఉద్యమాన్ని కొనసాగించాలని టీడీపీ శ్రేణులకు మాజీ మంత్రి గౌతు శివాజీ పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కాశీబుగ్గలో టీడీపీ శ్రేణులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి పదో రోజుకు చేరుకున్నా యి. దళిత నాయకులు, కార్యకర్తలు రిలే దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భం గా శివాజీ పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని చంద్రబాబును జైలుకు పం పించారని, ఎప్పటికైనా అంతిమ విజయం ధర్మానిదేనన్నారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్య క్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి గౌతు శిరీష, నాయకులు వజ్జ బాబూరావు, పీరుకట్ల విఠల్, లొడగల కామేశ్వరరావు యాదవ్, బడ్డ నాగరాజు, గాలి కృష్ణ, దళిత నాయకులు యాదగిరి, క్రాంతి, బైరాగి, శంకర్ పాల్గొన్నారు.
- కోటబొమ్మాళి: జనం మెచ్చిన నాయకుడు చంద్రబాబునాయుడు అని, ఆయనకు తోడుగా మేమున్నామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవింద రాజు అన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శుక్రవారం టీడీపీ కార్యాల యం ఆవరణలో నియోజకవర్గ నాయకులతో కలిసి సామూ హిక నిరాహార దీక్ష చేపట్టారు. చంద్రబాబు, లోకేష్‌ల సభలకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వ లేక ఇలా చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మం డల నాయకులు వెలమల విజయలక్ష్మి, కామేశ్వరరావు, తర్ర రామకృష్ణ, గొం డు లక్ష్మణరావు, కర్రి అప్పారావు, దేవాది సింహాద్రి, బండి అన్న పూర్ణ తదిత రులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు తరఫున వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా ముందస్తుగా స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్‌ఐ షేక్‌మహ్మద్ అలీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు మోహరించారు.
- నరసన్నపేట: రాష్ట్రంలో సైకో పాలన సాగుతోందని, దీనిని సాగనంపే వరకూ టీడీపీ పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నా రు. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన నేపథ్యంలో శుక్రవారం మత్స్య కారులు రిలే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. నియం త పాలన నుంచి రాష్ట్రం విముక్తి కావాలని, చంద్రబాబును విడుదల చేయాల ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మత్స్యకార నాయకులు మైలపల్లి త్రినాథ రావు, నాయకులు జల్లు చంద్రమౌళి, బైరి భాస్కరరావు, గొద్దు చిట్టిబాబు, మ హాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు బెయిల్ పిటిష న్ కొట్టివేయడంతో టీడీపీ నాయకులు ఆందోళన చేస్తారనే ఉద్దేశంతో పోలీ సులు బగ్గు రమణమూర్తిని ముందస్తు అరెస్ట్ చేశారు. కత్తిరివానిపేటలో పోలాకి ఎస్‌ఐ సత్యనారాయణ ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.
- పాతపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులతో అరెస్ట్ చేయడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. మేముసైతం బాబుకోసం కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురునేతలు పాల్గొన్నారు.
దేవీ ఆశ్రమంలో పూజలు
ఎచ్చెర్ల: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఆ యన కుటుంబానికి ఏర్పడిన ఆటంకాలు తొలగాలని పొందూరు ఏఎం సీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం పూజలు చేశారు. ఈ మేరకు కుంచాలకురమయ్యపేటలోని దేవీఆశ్రమంలో శ్రీక్ర మేరు వులకు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. చంద్రబాబు ఈ కేసుల నుంచి బయటపడి, రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడాలని కోరుతూ 1000 మంది మహిళలతో రాజరాజేశ్వరి అమ్మ వారికి వేడుకున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలోని నాలుగు మండ లాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారన్నారు.
Updated Date - 2023-09-22T23:47:56+05:30 IST