బారసాలకు వెళ్లివస్తుండగా..
ABN, First Publish Date - 2023-03-05T23:04:54+05:30
బారసాలకు కుటుంబంతో కలిసి వెళ్లివస్తున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. పోలీసులు, స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.
పాలకొండ/హరిపురం: బారసాలకు కుటుంబంతో కలిసి వెళ్లివస్తున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. పోలీసులు, స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మందస మండలం పొత్తంగి గ్రామానికి చెందిన కె.శేషగిరిరావు (30), తన భార్య సోనియా, తల్లి పార్వతీ, ఇతర కుటుంబ సభ్యులు కలిసి పార్వతీపురంలో జరిగిన బారసాల కార్యక్రమానికి కారులో వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా పాలకొండ మండలం అట్టలి జంక్షన్ వద్ద కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. దీంతో కారు ముందుభాగం నుజ్జును జ్జయ్యింది. శేషగిరిరావు కారు క్యాబిన్‌లో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి పార్వతికి స్వల్పగాయాలయ్యాయి. భార్య సోనియాతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. శేషగిరిరావు మృతితో పొత్తంగిలో విషాదఛాయలు అలముకున్నాయి.
Updated Date - 2023-03-05T23:04:54+05:30 IST