ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగునీటికి కటకటలాడుతున్నాం

ABN, First Publish Date - 2023-02-06T23:44:22+05:30

‘సమస్యలతో సతమతమౌతున్నా పట్టించుకొనే నాథుడే లేడు. ప్రజా ప్రతినిధులకు సమస్యలు పట్టవా?.’ అని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ను జాడ, ముక్కు పేట గ్రామస్థులు నిలదీశారు.

జాడలో ఎమ్మెల్యే కిరణ్‌ను నిలదీస్తున్న మహిళ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జి.సిగడాం: ‘సమస్యలతో సతమతమౌతున్నా పట్టించుకొనే నాథుడే లేడు. ప్రజా ప్రతినిధులకు సమస్యలు పట్టవా?.’ అని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ను జాడ, ముక్కు పేట గ్రామస్థులు నిలదీశారు. సోమవారం ఈ రెండు గ్రామాల్లో ఆయన గడపగడ పకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముక్కుపేటలో సుమారు 40 దళిత కుటుంబాలు నివసిస్తున్నాయని, తాగునీటికి కటకటలాడుతున్నామని గ్రామస్థు లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జాడలో డ్రైనేజీ సమస్య నెలకొందని, మూడేళ్లుగా విద్యుత్‌ సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్థులు చెప్పారు. అరకొర తాగునీటితో నెట్టుకొస్తున్నామని వాపోయారు. 14 ఏళ్లు నుంచి దర్జీ వృత్తి చేస్తున్నా చేదోడు పథకానికి నోచుకోలేదని కోన రూప, సీసీ రోడ్డు, కాలువలు నిర్మించాలని సరాబువీధి ప్రజలు, ఇల్లు కాలిపో యినా కొత్తది మంజూరు చేయలేదని కొండపల్లి అప్పలనరసమ్మ ఎమ్మెల్యేకు సమస్య లు ఏకరువు పెట్టారు. కార్యక్రమంలో నాయకులు పెద్ది శ్రీనివాసరావు, కోరాడ కేశవరా వు, ఇజ్జి శ్రీనివాసరావు, చిక్కాల ధర్మారావు, పోతల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:44:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising