వంశధార నీరందించండి
ABN, First Publish Date - 2023-10-28T00:23:13+05:30
టెక్కలిమండలపరిషత్ సర్వసభ్య స మావేశంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు శివారు ప్రాంతాలకు సాగునీటి సమస్యపై నిలదీశారు. శుక్రవారం ఎంపీపీ ఆట్ల సరోజినమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాలువ చెంతనే ఉన్న ఎత్తి పోతల పథకాలు, శివారు ప్రాంతాలకు నీరందించ కుండా ఎవరో పెద్దలు, ఇతర ప్రాంత నాయకులు చెప్పారని కిందికి వంశధార నీరు అధికారులు తరలి స్తున్నారని సభ్యులు వంశధార ఏఈ కె.శివాజీని నిలదీశారు.
టెక్కలి: టెక్కలిమండలపరిషత్ సర్వసభ్య స మావేశంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు శివారు ప్రాంతాలకు సాగునీటి సమస్యపై నిలదీశారు. శుక్రవారం ఎంపీపీ ఆట్ల సరోజినమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాలువ చెంతనే ఉన్న ఎత్తి పోతల పథకాలు, శివారు ప్రాంతాలకు నీరందించ కుండా ఎవరో పెద్దలు, ఇతర ప్రాంత నాయకులు చెప్పారని కిందికి వంశధార నీరు అధికారులు తరలి స్తున్నారని సభ్యులు వంశధార ఏఈ కె.శివాజీని నిలదీశారు.ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోరారు. నీటి సమస్యపై సభ్యు లతో కలిపి వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దువ్వాడ వాణి కూడా ప్రశ్నించడం విశేషం.‘వంశధార సాగు నీరు పంపిణీలో టెక్కలి నియోజకవర్గ రైతులకు అన్యాయం జరిగింది. కోటబొమ్మాళి, టెక్కలి, నంది గాం, సంతబొమ్మాళి మండలాల్లో పలు ప్రాంతాల్లో వరిపంటకు నీరందకఎండిపోతోంది. మా నియోజక వర్గ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోం. ఎత్తి పోతల పథకాల ద్వారా కూడా శివారు ప్రాంతాలకు నీరందించాలి’ టెక్కలి జడ్పీటీసీ, వైసీపీ నియోజ కవర్గ ఇన్‌చార్జి దువ్వాడ వాణి తెలిపారు. ఎత్తిపోతల పథకాలకు విద్యుత్‌సరఫరా పునరు ద్ధరించాలని, శివారుప్రాంత ఆయకట్టుకు నీరం దించాలని విద్యుత్ శాఖ ఏఈ టి.ఈశ్వరరావు, వంశధార ఏఈ కె.శివాజీలను కోరారు. వరి పం ట చివరిదశలోఉండడంతో ఈవారం నీరు కీల కమని అధికారులకు సూచించారు.
కార్యకర్తలు...సభ్యుల పతులు
టెక్కలి మండల సమావేశం వైసీపీ కార్యకర్తల సమావేశాన్ని తలపించింది. ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లకు సంబంధించి సతుల స్థానంలో పతు లు హాజరై అధికారులను ప్రశ్నించడం విశేషం. మం డలపరిషత్ అభివృద్ధి పనులకు సంబంధించి నిధు లు కేటాయింపులో వివక్ష జరుగుతోందని పలు వురు సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. నిధు లు కేటాయింపులో వ్యత్యాసం నెలకొందని పలు వురు సభ్యులు ధ్వజమెత్తారు. దీంతో స్పందించిన దువ్వాడవాణి మాట్లాడుతూ నాలుగు గోడలు మధ్య ఇటువంటి విషయాలు మాట్లాడుకోవాలే తప్ప ఇలా బహిరంగంగా చర్చించుకుంటే మీడియా ముందు మన పరువు ఏమవుతుందని సభ్యులకు తెలియజే శారు.వైస్‌ఎంపీపీలు మన్నేల కిషోర్, పేడాడ రమేష్ పంచాయతీల్లో జరుగుతున్న వైఫల్యాలను బహి రంగంగా చెప్పడంతో వాణి వారిపై అసహనం వ్యక్తంచేశారు. కొంతమంది సభ్యులు గ్రూపు రాజ కీయాలు చేయాలంటే కుదరదని, నన్ను బ్లాక్‌మె యిల్ చేస్తే భయపడేదిలేదని హెచ్చరించారు. మరో సారి సభ్యులు ఈ అంశంపై మాట్లాడుతూ భజన పరులకే పనులు ఇస్తున్నారని, కొందర్ని పట్టించుకో వడంలేదని పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు నిలదీశారు. సమావేశంలో పశుసంవర్ధకశాఖ, జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్, అటవీశాఖ, ఆర్టీసీ, ఉద్యానవనశాఖ, కార్మికశాఖ, కోఆపరేటివ్, పరిశ్రమలు, డివిజినల్ పంచాయతీ తదితర శాఖల అధికారులు గైర్హాజరు కాగా కొన్ని శాఖల అధికారులు ఆలస్యంగా సమావేశానికి హాజరయ్యా రు. సమావేశంలో ఎంపీడీవో చింతాడ లక్ష్మీభాయి, పీఏసీఎస్ అధ్యక్షులు సత్తారు సత్యం, ప్రత్యేకాహ్వా నితులు శంకర్ మేస్త్రీ పాల్గొన్నారు.
Updated Date - 2023-10-28T00:23:13+05:30 IST