ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మంచివారికి ఓటు వేయండి

ABN, First Publish Date - 2023-06-26T00:03:39+05:30

కులం, మతంతో సంబంధం లేకుండా మంచి వారికి, అభివృద్ధి పనులు చేసిన వారికి, దేశం కోసం పాటుపడిన వారికి ఓటువేయాలని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు అన్నారు.

మాట్లాతున్న గరికపాటి నరసింహారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు

శ్రీకాకుళం కల్చరల్‌: కులం, మతంతో సంబంధం లేకుండా మంచి వారికి, అభివృద్ధి పనులు చేసిన వారికి, దేశం కోసం పాటుపడిన వారికి ఓటువేయాలని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 80 ఫీట్‌ రోడ్డులోని ఓ కల్యాణ మండపంలో సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల సమతా సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా గరికిపాటి మాట్లాడుతూ.. ఓంకారానికి శక్తి ఉందని, ఓంకార నాదం చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుందన్నారు. వేదం నేర్చుకోవడానికి కులమత బేధాలు ఉండవని అందరూ నేర్చుకోవచ్చునన్నారు. కులం పేరు పెట్టి రాజకీయాలు చేయడం ద్రోహమన్నారు. తెలుగు భాష ఎంతో గొప్పదన్నారు. హిందుత్వం అందరి మతమని సమరసత వేదిక రాష్ట్ర అధ్యక్షుడు హటకేశం అన్నారు. స్వామి శ్రీనివాసానంద మాట్లాడుతూ.. హిందువులపై దాడులు ఆపాలన్నారు. మాజీమంత్రి గౌతు శ్యామ్‌సుందర్‌ శివాజీ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో ఆనాటి స్వాతంత్య్ర ఉద్యమకారులు సాహిత్యం, సేవా కార్యక్రమాలతో అభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డు ఉపకులపతులు హనుమంతు లజపతిరాయ్‌, గొల్లపల్లి నాగేశ్వరరావు, బూసిరాజు, పి.సుందరీరాణి, కన్నంనాయుడు, నర్సింగనాయుడు, డాక్టర్‌ కె.అమ్మన్నాయుడు, డాక్టర్‌ కొంచాడ సోమేశ్వరరావు, డాక్టర్‌ పులఖండం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించారు. రచయిత భమిడిపాటి గౌరీశంకర శాస్ర్తి రచించిన ఉత్తరాంధ్ర సమరతా సారథులు పుస్తకాన్ని గరికిపాటి ఆవిష్కరించారు.

Updated Date - 2023-06-26T00:03:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising