ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

20 ఏళ్లుగా వెట్టిచాకిరీ

ABN, First Publish Date - 2023-08-22T23:45:00+05:30

ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో పాసై కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా 20 ఏళ్ల నుంచి వెట్టిచాకిరీ చేస్తున్నా తమను రెగ్యులరైజ్‌ చేయలేదని, కనీసం సమాన పనికి సమాన వేతనం ఉత్తర్వులను అమలు చేయడం లేదని ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు మంగళవారం మందస, సంతబొమ్మాళి ఎమ్మార్సీ కార్యాల యాల ఎదుట నిరసన తెలిపారు.

హరిపురం: మందస ఎమ్మార్సీ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది

హరిపురం/మందస/సంతబొమ్మాళి: ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో పాసై కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా 20 ఏళ్ల నుంచి వెట్టిచాకిరీ చేస్తున్నా తమను రెగ్యులరైజ్‌ చేయలేదని, కనీసం సమాన పనికి సమాన వేతనం ఉత్తర్వులను అమలు చేయడం లేదని ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు మంగళవారం మందస, సంతబొమ్మాళి ఎమ్మార్సీ కార్యాల యాల ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘ నేతలు మాట్లాడుతూ.. విద్యాశాఖకు సంబంధించిన అన్ని పనులతోపాటు జగనన్న విద్యాకానుక పంపిణీలోనూ తమను వినియోగించుకుంటున్నా కనీసం నెలనెలా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సర్వీసు లను రెగ్యులర్‌ చేయాలని, ఎంటీఎస్‌ పద్ధతిలో వేతనాలి వ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమాల్లో ఎమ్మార్సీ సిబ్బంది రాంబాబు, లవకుమార్‌, ‘భవిత’ ఉపాధ్యాయులు ప్రసాద్‌, అంబిక, సీఆర్పీలు జానకిరామయ్య, మాధవదాస్‌, పురుషోత్తం, కంప్యూటర్‌ ఆపరేటర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T23:45:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising