ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

లెక్చరర్లగా పదోన్నతి కల్పించాలి

ABN, First Publish Date - 2023-09-04T00:01:46+05:30

అర్హత గల స్కూల్‌ అసిస్టెంట్లు, సమాన కేడర్‌ గలవారు, సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు జూనియర్‌ లెక్చరర్‌ పదోన్నతులు కల్పించాలని జిల్లా ఫోరం ఆఫ్‌ రిజిస్టర్డ్‌ టీచర్స్‌ ఆర్గనైజేషన్‌ (ఫోర్టో) సభ్యులు డిమాండ్‌ చేశారు.

అరసవల్లి, సెప్టెంబరు 3: అర్హత గల స్కూల్‌ అసిస్టెంట్లు, సమాన కేడర్‌ గలవారు, సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు జూనియర్‌ లెక్చరర్‌ పదోన్నతులు కల్పించాలని జిల్లా ఫోరం ఆఫ్‌ రిజిస్టర్డ్‌ టీచర్స్‌ ఆర్గనైజేషన్‌ (ఫోర్టో) సభ్యులు డిమాండ్‌ చేశారు. ఆదివారం నగరంలో గల ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పదోన్నతులు కల్పించడంలో ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్‌ చేయడం ద్వారా విద్యార్హత, అనుభవం గల ఉపాధ్యాయులు నష్టపోతున్నారని, వారికి కూడా జూనియర్‌ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సంఘ రాష్ట్ర బాధ్యులు బలివాడ ధనుంజయరావు, చైర్మన్‌ పిసిని వసంతరావు, సెక్రటరీ జనరల్‌ బి.రాజేశ్వరరావు, ఎస్‌జీటీఎఫ్‌, రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటరమణ, జిల్లా ఏపీ ఎంటీఎఫ్‌ అధ్యక్షుడు డీవీఆర్‌ పట్నాయక్‌, డి.గణపతిరావు, ఎస్‌.మల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T00:01:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising