అమ్మవారి ఆలయంలో చోరీ
ABN, First Publish Date - 2023-05-31T23:42:13+05:30
పట్టణంలోని గాంధీనగర్ మహేశ్వరమ్మ అమ్మవారి ఆలయంలో మంగ ళవారం అర్ధరాత్రిదాటిన తరువాత చోరీజరిగింది. బుధశారం అర్చకుడు ఎన్.బాబూ రావు, భార్య ప్రభ బుధవారం ఉదయం ఆలయాన్ని శుభ్రం చేసి, ఆలయం తెరి చేందుకు వెళ్లగా ఆలయం తెరిచి ఉండడాన్ని గమనించారు.
పలాస: పట్టణంలోని గాంధీనగర్ మహేశ్వరమ్మ అమ్మవారి ఆలయంలో మంగ ళవారం అర్ధరాత్రిదాటిన తరువాత చోరీజరిగింది. బుధశారం అర్చకుడు ఎన్.బాబూ రావు, భార్య ప్రభ బుధవారం ఉదయం ఆలయాన్ని శుభ్రం చేసి, ఆలయం తెరి చేందుకు వెళ్లగా ఆలయం తెరిచి ఉండడాన్ని గమనించారు. అలాగే హుండీ విర గ్గొట్టి అందులోని సుమారు రూ.30 వేలు అపహరించి దూరంగా పడేసినట్లు గుర్తిం చారు. వెంటనే అర్చకుడు కమిటీ సభ్యులకు విషయం తెలియజేయగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మవారి బంగారు ఆభరణాలను లాకర్‌లో భద్రపర చగా హుండీని ఆరు నెలలు గా తెరవలేదు. కమిటీ సభ్యుల సమక్షంలో లెక్కిం చాలని భావించారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఆలయం తలుపులు పగుల గొట్టి హుండీని చోరీ చేశారు. ఈమేరకు సంఘ టన స్థలానికి క్లూస్‌టీమ్ చేరుకొని పరిశీలించారు. కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.శ్రీనివాసరావు తెలిపారు.
Updated Date - 2023-05-31T23:42:13+05:30 IST