ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు సీఎం కావడం రాష్ట్రానికి ఆవశ్యకం

ABN, First Publish Date - 2023-02-08T23:28:42+05:30

రాష్ట్రానికి సీఎంగా మళ్లీ చంద్రబాబునాయుడు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని టీడీపీ ఎన్‌ఆర్‌ఐ యూఎస్‌ఏ విభాగం కోఆర్డినేటర్‌ కోమటి జయరాం అన్నారు. పాతపట్నంలో మొబైల్‌ అన్న క్యాంటీన్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేఎస్‌ఎం ప్లాజాలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనేక మంది ముఖ్యమంత్రులను చూశాం గాని ఇలాంటి కక్షపూరిత పాలన ఎక్కడా చూడ లేదన్నారు. రాష్ట్రంలో జగన్‌ చక్కగా పాలిస్తారని అత్యధిక మెజార్టీతో గెలిపించారని, ఇక మా సేవలు రాష్ట్రానికి అవసరం లేదని భావించామని, కాని ఒక్కడ చూస్తే సైకో పాలన సాగు తున్నట్లుందన్నారు. ఎవరికీ పేరు రాకుండా కక్షపూరిత పాలన చేస్తున్నారని ఆరోపించారు.

మొబైల్‌ అన్నక్యాంటీన్‌ను ప్రారంభిస్తున్న టీడీపీ ఎన్‌ఆర్‌ఐ యూఎస్‌ఏ కో ఆర్డినేటర్‌ కోమటి జయరాం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ ఎన్‌ఆర్‌ఐ యూఎస్‌ఏ కో ఆర్డినేటర్‌ కోమటి జయరాం

పాతపట్నంలో మొబైల్‌ అన్న క్యాంటీన్‌ ప్రారంభం

పాతపట్నం, ఫిబ్రవరి 8: రాష్ట్రానికి సీఎంగా మళ్లీ చంద్రబాబునాయుడు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని టీడీపీ ఎన్‌ఆర్‌ఐ యూఎస్‌ఏ విభాగం కోఆర్డినేటర్‌ కోమటి జయరాం అన్నారు. పాతపట్నంలో మొబైల్‌ అన్న క్యాంటీన్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేఎస్‌ఎం ప్లాజాలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనేక మంది ముఖ్యమంత్రులను చూశాం గాని ఇలాంటి కక్షపూరిత పాలన ఎక్కడా చూడ లేదన్నారు. రాష్ట్రంలో జగన్‌ చక్కగా పాలిస్తారని అత్యధిక మెజార్టీతో గెలిపించారని, ఇక మా సేవలు రాష్ట్రానికి అవసరం లేదని భావించామని, కాని ఒక్కడ చూస్తే సైకో పాలన సాగు తున్నట్లుందన్నారు. ఎవరికీ పేరు రాకుండా కక్షపూరిత పాలన చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కూరగాయలు నుంచి అన్ని రకాల వస్తువులకు డిజిటల్‌ చెల్లింపులు సాగుతుంటే మద్యం దుకాణాల్లో మాత్రం నగదు మాత్రమే ఇవ్వాలని కోరడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌పై ఉన్న మమకారంతో అన్నక్యాంటీన్‌ ప్రారంభిస్తున్నామన్నారు. నెలరోజుల్లో ఎస్‌.కోట నియోజకవర్గంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించనున్నామన్నారు. అనంతరం జన్మభూమి ఫౌండేషన్‌ సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతా మని చెప్పారు. అందరూ పట్టుదలతో, ఐక్యంగా పనిచేసి రాష్ట్రంలో టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తి మాట్లాడుతూ.. మహిళా ఎన్‌ఆర్‌ఐ కమిటీ సభ్యులు జాగర్ల ముడి శివాని ఆధ్వర్యంలో నియోజకవర్గ మహిళా బృందం ఎన్‌టీఆర్‌ అన్నక్యాంటీన్‌ ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. దీనికి అందరూ సహ కరించాలని కోరారు. నిరుపేదలు రూ.5లకే సంతృప్తికరమైన భోజనం చేసే అవకాశం కలిగిందన్నారు. అంతకుముందు శ్రీనీలమణి దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. సమావేశంలో ఎన్‌ఆర్‌ఐ బృందం సభ్యులు గొంప కృష్ణ, గోకుల్‌ బుచ్చిరాజు, దొడ్డపనేని శ్రీకాంత్‌, తెలుగు యువత కార్యదర్శి సంజీవని, శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-08T23:28:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising