ప్రాణదాతకు జోహార్లు
ABN, First Publish Date - 2023-06-03T00:32:26+05:30
ఆమె ఈ లోకంలో లేకున్నా.. అవయవాలు మాత్రం సజీవం. తల నొప్పితో బాధ పడుతూ.. బ్రెయిన్‌డెడ్‌కు గురైన ఆమె అవయవాల దానానికి కుటుంబ సభ్యులు అంగీకరిం చారు. పుట్టెడు దుఃఖంలోనూ స్ఫూర్తిదాయకమైన నిర్ణ యం తీసుకోవడంతో ఆమె ప్రాణదాతగా నిలిచింది. నలు గురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపనుంది.
- మదుపాం వీవోఏ చంద్రకళ బ్రెయిన్‌డెడ్
- నలుగురికి అవయవదానం
జి.సిగడాం, జూన్ 2: ఆమె ఈ లోకంలో లేకున్నా.. అవయవాలు మాత్రం సజీవం. తల నొప్పితో బాధ పడుతూ.. బ్రెయిన్‌డెడ్‌కు గురైన ఆమె అవయవాల దానానికి కుటుంబ సభ్యులు అంగీకరిం చారు. పుట్టెడు దుఃఖంలోనూ స్ఫూర్తిదాయకమైన నిర్ణ యం తీసుకోవడంతో ఆమె ప్రాణదాతగా నిలిచింది. నలు గురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపనుంది. వివరాల్లోకి వెళితే.. జి.సిగడాం మండలం మదుపాం గ్రామానికి చెం దిన వీవోఏ పట్నాన చంద్రకళ(30)కు బ్రెయిన్ డెడ్ అయింది. విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ శుక్రవారం ఆమె మృతి చెందింది. పుట్టెడు దుఃఖం లోనూ భర్త శివ, కుటుంబ సభ్యులు ఆమె అవయవ దానానికి నలుగురికి కొత్త జీవితాన్ని ప్రసా దించేందుకు ముందుకొచ్చారు. శివ, చంద్రకళ ఇద్దరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె హేమలత ఏడో తరగతి, చిన్న కుమార్తె ఉషారాణి ఐదోతరగతి చదువుతున్నారు. చంద్రకళ వెలుగు విభాగంలో వీవోఏగా పనిచేస్తోంది. గత నెల 31న ఈమె తీవ్ర తలనొప్పితో బాధపడుతూ అనారోగ్యానికి గురైంది. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలో మెడికవర్ ఆస్ప త్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యులు విశాఖ పట్నంలో విమ్స్‌కు రెఫర్ చేశారు. విమ్స్‌లో న్యూరోసర్జరీ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. మెదడులో తీవ్ర రక్తస్రావం కావడంతో బ్రెయిన్‌డెడ్‌గా గుర్తించారు. ఈ విషయాన్ని విమ్స్ డైరెక్టర్, జీవన్‌దాన్ ఏపీ కో-ఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు మృతురాలి కుటుంబ సభ్యులకు చెప్పారు. అవయవదానంపై అవగాహన కల్పించారు. తన భార్య కళ్ల ముందు లేకపోయినా.. నలుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుందనే ఉద్దేశంతో అవయవ దానానికి భర్త శివ అంగీక రించారు. ఈ నేపథ్యంలో చంద్రకళ నుంచి రెండు కళ్లు, రెండు కిడ్నీలను సేకరించారు. రెండు కిడ్నీ లను వేర్వేరు ఆసుపత్రులకు, కళ్లను ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి కేటాయించినట్లు డాక్టర్ రాంబాబు తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారం ఆ అవయవాలను అవసరమైన రోగులకు అందజేయనున్నట్టు వెల్లడించారు. మరణించినా.. నలుగురి జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రకళ మృతదేహానికి విమ్స్ సిబ్బంది కన్నీటి వీడ్కోలుతో జోహార్లు పలికారు. చంద్రకళ మృతిచెందటంతో భర్త శివ, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇద్దరు కుమార్తెలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. గ్రామంలోనూ విషాదఛాయలు అలముకున్నాయి.
Updated Date - 2023-06-03T00:32:26+05:30 IST