పోలియో నిర్మూలనే లక్ష్యం
ABN, First Publish Date - 2023-02-27T00:18:30+05:30
పోలీయో నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు రోటరీ(302) జిల్లా పోలియో నిధుల సేకరణ చైర్మన్ డాక్టర్ వై.కల్యాణ్ చక్రవర్తి అన్నారు. స్థానిక హెచ్‌బీ కాలనీలో గల రోటరీ వనంలో రోటరీ క్లబ్ శ్రీకాకుళం, సెంట్రల్ రోటరీ క్లబ్ ఆమదాలవలస వారితో సంయుక్తంగా పోలియో నిధులు సేకరణపై సదస్సు నిర్వహించారు.
శ్రీకాకుళం కల్చరల్: పోలీయో నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు రోటరీ(302) జిల్లా పోలియో నిధుల సేకరణ చైర్మన్ డాక్టర్ వై.కల్యాణ్ చక్రవర్తి అన్నారు. స్థానిక హెచ్‌బీ కాలనీలో గల రోటరీ వనంలో రోటరీ క్లబ్ శ్రీకాకుళం, సెంట్రల్ రోటరీ క్లబ్ ఆమదాలవలస వారితో సంయుక్తంగా పోలియో నిధులు సేకరణపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రోటరీ అంతర్జాతీయ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పోలియోను అంతం చేయడమేనని లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, బిల్‌గేట్స్ ఫౌండేషన్, ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేస్తూ ఇప్పటివరకు పోలియో నిర్మూలనకు రూ.30 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది రోటరీ జిల్లా (3020) పోలియో నిర్మూలనకు రెండు కోట్లు నిధుల సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు రూ.50 లక్షలు సేకరించిందన్నారు. కార్యక్రమంలో సహాయ గవర్నర్లు ఎంఆర్‌కే దాస్, జలుమూరు వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం అధ్యక్ష కార్యదర్శలు అన్నెపు సత్యనారాయణ, బరాటం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-27T00:18:32+05:30 IST