ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల రోజుల్లో పోర్టుకు శంకుస్థాపన

ABN, First Publish Date - 2023-02-21T23:51:06+05:30

మూలపేటలో పోర్టు నిర్మాణా నికి నెలరోజుల్లో సీఎం జగన్మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేస్తారని టెక్కలి సబ్‌కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. మూలపేటలో మంగళవారం సాయంత్రం గ్రామసభ నిర్వహించారు. ఐదు బృందా లుగా సర్వే చేసి 161 మంది రైతులకు పరిహారం అందించేందుకు గుర్తించినట్లు తెలిపారు.

మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌రెడ్డి

సంతబొమ్మాళి, ఫిబ్రవరి 21: మూలపేటలో పోర్టు నిర్మాణా నికి నెలరోజుల్లో సీఎం జగన్మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేస్తారని టెక్కలి సబ్‌కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. మూలపేటలో మంగళవారం సాయంత్రం గ్రామసభ నిర్వహించారు. ఐదు బృందా లుగా సర్వే చేసి 161 మంది రైతులకు పరిహారం అందించేందుకు గుర్తించినట్లు తెలిపారు. సర్వే నెంబరు 194లో 19 మంది రైతుల నుంచి 8.50 ఎకరాలు, సర్వే నెంబరు 157లో 23 మంది రైతుల నుం చి 8.27 ఎకరాలు, సర్వే నెంబర్‌ 298లో 37.26 ఎకరాలు భూమిని సేకరించినట్లు తెలిపారు. రైతుల అధీనంలో ఉన్న ప్రభుత్వ భూము లకు ఎంత పరిహారం ఇస్తాన్నది ఇంకా స్పష్టత రాలేదన్నారు. ఇప్ప టికే 70 శాతం వ్యవసాయ భూములకు పరిహారం చెల్లించామ న్నారు. భూములిచ్చేందుకు ఎవరైనా మొండికేసినా పనులు ఆగవ న్నారు. రికార్డు ప్రాతిపదికన 18 ఏళ్లకు ఒక్క రోజు తగ్గినా పీడీఎఫ్‌కు రూ.9.91 లక్షల పరిహారం అందిస్తామన్నారు. టెక్కలి సీఐ చంద్ర మౌళి ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్ర మంలో చలమయ్య, సర్పంచ్‌ బాబూరావు, పలువురు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T23:51:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising