వైసీపీని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి..
ABN, First Publish Date - 2023-06-26T00:00:54+05:30
వైసీపీ విధ్వంస కర పాలనపై ప్రజలు విసు గెత్తి ఉన్నారని, ఆ పార్టీని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని టీడీపీ సీనియర్ నాయకుడు, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు గొండు శంకర్ అన్నారు.
- సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు గొండు శంకర్
అరసవల్లి: వైసీపీ విధ్వంస కర పాలనపై ప్రజలు విసు గెత్తి ఉన్నారని, ఆ పార్టీని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని టీడీపీ సీనియర్ నాయకుడు, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు గొండు శంకర్ అన్నారు. ఆది వారం శ్రీకాకుళం నగర పరిధిలోని 1వ వార్డులో టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు రెడ్డి శంకర్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. టీడీపీ మహానాడులో చేసిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయవన్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు పాండ్రంగి శంకర్, లక్ష్మీరాజ్యం, దొండపాటి నవీన్, కంచు దశరథ, బొల్ల నాగేంద్ర యాదవ్, ఎండు రామారావు, బైరి నరేష్, ఎండు చిన్నారావు, పంచిరెడ్డి అప్పలనాయుడు, బగ్గు నలమహారాజు, పంగ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-26T00:00:54+05:30 IST